ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ (AP DSC) ఫైనల్ కీ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్ (Website) లో కీ అందుబాటులో ఉంచినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి (DSC Convener MV Krishna Reddy) తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి లాగిన్ అయి కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ప్రాథమిక కీ విడుదల అనంతరం అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా అభ్యంతరాలు స్వీకరించారు. ఈ అభ్యంతరాలను నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించి తుది కీ సిద్ధం చేసింది. ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలు ఇకపై స్వీకరించబోమని డీఎస్సీ కన్వీనర్ స్పష్టం చేశారు.

పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌కు మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు సెషన్లలో పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పరీక్షలకు 92.90 శాతం మంది హాజరయ్యారు.
ఫలితాలపై ఆసక్తి
త్వరలో మెగా డీఎస్సీ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఫైనల్ కీ విడుదలతో అభ్యర్థులు తమ స్కోరును అంచనా వేసుకోవచ్చు. ఫలితాల ప్రకటన కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మెగా డీఎస్సీ ఫైనల్ కీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Read Also : India vs England : భారత్‌కు 52 పరుగుల ఆధిక్యం