ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravathi)లోని సచివాలయం ప్రాంగణం నేడు ప్రత్యేక వేడుకలకు వేదిక అయింది. మెగా డీఎస్సీ నియామకోత్సవం సందర్భంగా నూతనంగా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.
అనేక సంవత్సరాల కలకు నేడు రూపురేఖ
ఈ రోజు, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన వెయ్యాది మంది అభ్యర్థులు ఆనందంతో ఉప్పొంగిపోతూ మెగా డీఎస్సీ ఉత్సవ్ కార్యక్రమానికి హాజరయ్యారు. కొలువు కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ అభ్యర్థులకు ఇది జీవితాంతం మర్చిపోలేని రోజు.

నియామక పత్రాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలుగా ఎంపికైన అభ్యర్థులకు స్వయంగా నియామక పత్రాలు అందజేశారు.
ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్(Nara Lokesh), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా వేదికపై ఉన్నారు.
భావోద్వేగానికి గురైన ఉపాధ్యాయులు
కొలువు పొందిన కొత్త ఉపాధ్యాయులు ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు.
చిరకాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడాన్ని వారు తమ జీవిత విజయం గా భావిస్తున్నారు.“ఇది కేవలం ఉద్యోగం కాదు – మా జీవిత మార్పు” అని పలువురు అభ్యర్థులు ఆనందాన్ని పంచుకున్నారు.ఈ నియామకాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత పాక్షికంగా తీర్చబడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ డీఎస్సీ నియామకాలు విద్యారంగ అభివృద్ధికి కీలకమైన చర్యగా పరిగణిస్తున్నారు.
‘కొలువు పండుగ’కి విజయవంతమైన ఆరంభం
ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసం పెంచాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అభ్యర్థులు తమ ఆనందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వ్యక్తపరిచారు.
Read hindi news: hindi.vaartha.com