కడప కార్పొరేషన్ : కడప(Kadapa) కార్పొరేషన్ మేయర్ ఎన్నిక(Mayor Election) గురువారం జరిగింది. ఈ ఎన్ని కల్లో కడప మేయర్గా పాక సురేశ్ ఎన్నికయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ జరిగింది. మేయర్ అభ్యర్థిగా పాక సురేశ్ అభ్యర్థిత్వాన్ని వైఎస్సార్సీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, షఫీలు బలపరిచారు.
Read Also: రేపు రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం, మంత్రి లోకేశ్

వైఎస్సార్సీ కార్పొరేటర్ల మద్దతుతో ప్రమాణ స్వీకారం
ఈ ఎన్నికలో పాక సురేశ్ను అధికారికంగా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ప్రకటించారు. అనంతరం సురేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఛాంబర్లో విలేకరులతో పాకా సురేష్ మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన వైఎస్సార్సీ కార్పొ రేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. కడప ఎంపి అవినాష్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు, వైసీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్ర నాథెడ్డి, మాజీమంత్రి అంజాద్ భాష ధన్యవాదాలుతెలిపారు.
ఈ ప్రత్యేక (Mayor Election) సమావేశంలో 39 మంది వైఎస్సార్సీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. మేయర్ పదవీకాలం మూడు నెలలు గడువు మాత్రమే ఉండటంతో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గత కడప నగర మేయర్ సురేశ్ బాబును మేయర్ పదవిని తొలగించింది కూటమి ప్రభుత్వం. కాగా కడప నగర మేయర్ ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారి జేసీ అతిథి సింగ్కు వైఎస్సార్సీ అభ్యర్థి బీఫామ్, ఏ ఫాం, విప్ నోటీసు కాపీలను వైఎస్సార్సీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అందజే శారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అందరూ కార్పొరేటర్ల ఏకాభిప్రాయం తోనే మేయర్ అభ్యర్థిని ఖరారు చేశామని తెలిపారు. ఎవరూ అసంతృప్తికి లోను కాలేదని చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నవారే కార్పొరేటర్లుగా ఉన్నారని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: