సచివాలయాల ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో(AP Migrations) గత ఆరేళ్ల కాలంలో పెద్దఎత్తున వలసలు జరిగినట్టు వెల్లడైంది. రాష్ట్రం మొత్తం 1.71 కోట్ల కుటుంబాలు ఉండగా, అందులో 12.59 లక్షల కుటుంబాలు జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి.
Read Also: AP: స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

ఈ కుటుంబాల్లో(AP Migrations) ఎక్కువ మంది కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు సర్వేలో తేలింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే విశాఖపట్నం(Visakhapatnam) జిల్లా నుంచి అత్యధికంగా 1.13 లక్షల కుటుంబాలు వలస వెళ్లాయి. నెల్లూరు జిల్లా నుంచి సుమారు 85 వేల కుటుంబాలు రాష్ట్రం విడిచినట్టు నివేదిక పేర్కొంది.
ముఖ్యంగా రాష్ట్రంలో నిర్మాణ రంగంలో పనుల కొరత ఉండటమే ఈ వలసలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఉపాధి అవకాశాలు తగ్గడంతో కుటుంబాలంతా జీవన భద్రత కోసం ఇతర రాష్ట్రాలను ఆశ్రయించాల్సి వచ్చినట్టు విశ్లేషణ చెబుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: