మాలోజుల, ఆశన్నలపై మావోయిస్టుల ఘాటు వ్యాఖ్యలు
ఇటీవల సమాజ ప్రవాహంలో కలిసిన మాలోజుల వేణుగోపాల్ (Maoist) మరియు ఆశన్నలపై మావోయిస్టు పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. వీరిద్దరూ విప్లవ ఉద్యమాన్ని మోసం చేసి పార్టీకి ద్రోహం చేశారంటూ, శిక్ష తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైన లేఖలో, అమరుల సాక్షిగా మాలోజుల, ఆశన్నలకు తగిన శిక్ష విధించబడుతుంది. వారి చర్యలు మామూలు మోసం కాదు, ఉద్యమ పునాది మీదే దాడి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేఖలో పేర్కొనినదాని ప్రకారం, వీరిద్దరూ ప్రభుత్వ యంత్రాంగంతో చేతులు కలిపి ‘ఆపరేషన్ కగార్’(Operation Kagar)రూపంలో కుట్రను నెరవేర్చారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. దీనికి స్పందనగా పార్టీ తన చర్యలను నిర్ణయించనుందని స్పష్టం చేశారు.
Read also: దీపావళి తర్వాత హైదరాబాద్‌లో వాయు కాలుష్యం గరిష్టం

ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేస్తూ మావోయిస్టు (Maoist) కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ మరో లేఖ విడుదల చేశారు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ ప్రాంతాల్లో యుద్ధాన్ని జరుపుతున్నాయి ప్రభుత్వాలు అని ఆ లేఖలో ఆరోపించారు. ప్రస్తుత దమనకాండలకు నిరసనగా అక్టోబర్ 23 వరకు నిరసనలు నిర్వహించాలని, అక్టోబర్ 24న దేశవ్యాప్తంగా బంద్‌ను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ప్రజలు, ప్రజాసంఘాలు ఈ పోరాటంలో భాగస్వామ్యులై ప్రభుత్వాల దమన విధానాలను వ్యతిరేకించాలని అభయ్ విజ్ఞప్తి చేశారు. ఈ బంద్‌ను ఒక ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు మావోయిస్టులు వ్యూహాత్మకంగా పనిచేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :