हिन्दी | Epaper

Malla Ramgopal Naidu: కీర్తి చక్ర మేజర్ కి AP Govt భారీ నజరానా

Anusha
Malla Ramgopal Naidu: కీర్తి చక్ర మేజర్ కి AP Govt భారీ నజరానా

కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడి (Malla Ramgopal Naidu) కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.. ఆయనకు రూ.1.25 కోట్లు అందిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. మేజర్ రామ్‌గోపాల్‌నాయుడు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామం.

Read Also: Tirupati: ఇంజినీరింగ్ విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య

2023 అక్టోబర్‌ 26న జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద జరిగిన పోరాటంలోరామ్‌గోపాల్‌నాయుడు (Malla Ramgopal Naidu) తన ప్రాణాలను పణంగా పెట్టి.. ఉగ్రవాదులకు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. తన తోటి సైనికుల ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించారు.. ఆయన చూపిన వీరత్వం, ధైర్య సాహసాలకు గాను ఈ అవార్డును అందుకున్నారు. శౌర్య పురస్కారం అందుకున్న ఏకైక తెలుగు మేజర్‌గా ప్రశంసలు అందుకుంటున్నారు. జమ్మూలోని కుప్వారా జిల్లాలో జిల్లాలో ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం వచ్చింది.

Malla Ramgopal Naidu: AP Govt gives huge reward to Kirti Chakra Major
Malla Ramgopal Naidu: AP Govt gives huge reward to Kirti Chakra Major

ఆపరేషన్‌ను విజయవంతం

రామ్‌గోపాల్‌ నాయుడు తన సహచర సైనికులతో కలిసి సోదాలు చేపట్టారు. స్థానికుల ఇళ్లలో దాక్కున్న ఐదుగురు ఉగ్రవాదులు సైనికులను చూడగానే కాల్పులు ప్రారంభించారు. అప్పుడు రామ్‌గోపాల్‌ నాయుడు ఎంతో ధైర్యంగా, ఏమాత్రం వెనకాడకుండా ముందుకు దూకి, ముగ్గురు ఉగ్రవాదులను అతి సమీపం నుంచే కాల్చి చంపారు. ఒక ఉగ్రవాది తప్పించుకుని పారిపోవడంతో..

అతడి కోసం వెతుకుతుండగా, మిగిలిన ఐదో ఉగ్రవాది రామ్‌గోపాల్‌ బృందంపై గ్రెనేడ్‌ విసిరాడు. అయితే రామ్‌గోపాల్‌ నాయుడు చాకచక్యంగా ఆ, గ్రెనేడ్‌ దాడి నుంచి తప్పించుకుని.. ఆ ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టి ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించారు. తన తోటి సైనికులను రక్షించుకుంటూనే శత్రువులను మట్టుబెట్టిన నాయుడికి కీర్తిచక్ర అవార్డును ప్రకటించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నగదు బహుమతి కూడా ఇస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

📢 For Advertisement Booking: 98481 12870