Madanapalle Murder Case: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సంచలనం సృష్టించిన చిన్నారి హత్య కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా, మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యలో కులవర్ధన్ తల్లి అంజమ్మ పాత్ర కూడా ఉందని తేలడంతో, పోలీసులు ఆమెను A2 (రెండవ నిందితురాలు) గా చేర్చారు.
Read Also: Madanapalle Crime: బాలికపై హత్యాచారం కేసు నిందితుడు సూసైడ్

ప్రజా నిరసనలు – పోలీసుల చర్యలు
ఈ ఘటనపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. స్థానికులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో కలిసి మదనపల్లెలో రోడ్లను దిగ్బంధించారు. నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో, ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు సీపీఐ నేతలు మరియు ఇతర రాజకీయ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: