పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సీఎం చంద్రబాబు (Chandrababu) సూచించారు. తిరుపతిలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర (Golden Andhra-Clean Andhra) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకం పెరిగితే ప్రజలు క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.ముందుగా రేణిగుంట సమీపంలోని తూకివాక ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ అధికారులు అందించిన వివరాలను సీఎం పరిశీలించారు. ఆపై తిరుపతికి వెళ్లి కపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు.దేవాలయం పరిసరాల్లో పారిశుధ్య సిబ్బందితో కలిసి శుభ్రపరిచారు. చీపురుతో ఊడ్చి, చెత్త తొలగించారు. ఆ తరువాత ప్రజావేదిక సభలో ప్రసంగించారు.

యువతే మార్గదర్శకులు – స్వచ్ఛాంధ్రలో పాత్ర కీలకం
యువత చురుకుగా ఉండడం అభినందనీయం అన్నారు. “నేనూ తిరుపతిలోనే చదువుకున్నాను,”I అని గుర్తు చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.తాజాగా జాతీయ స్థాయిలో ఐదు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రాష్ట్రానికి లభించాయి. విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఈ గుర్తింపు పొందాయి. ఇది పారిశుధ్య కార్మికుల కృషి ఫలమన్నారు.ఆగస్టు 15 నాటికి రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ ఫ్రీ చేయనున్నామని తెలిపారు. అక్టోబర్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీలు, డిసెంబర్ నాటికి రాష్ట్రం మొత్తంగా ప్లాస్టిక్ రహితం చేయనున్నామని చెప్పారు.
సర్క్యులర్ ఎకానమీ – సమృద్ధికి మార్గం
తూకివాకలో 300 ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యర్థాలను పునర్వినియోగించి సంపదగా మార్చాలన్నారు. డిసెంబర్ నాటికి 100 శాతం చెత్త తొలగింపే లక్ష్యమని చెప్పారు.చిన్ననాటి లో కరెంటు లేకుండానే చదువుకున్నానన్నారు. ఇప్పుడు ఇంటి మీదే కరెంటు ఉత్పత్తి జరుగుతోందన్నారు. గ్రీన్ ఎనర్జీే భవిష్యత్తు అని స్పష్టం చేశారు.
Read Also : Nara Lokesh : 18 రోజుల్లో 50 లక్షల ఇళ్ల సందర్శనతో టీడీపీ రికార్డ్