విజయవాడ Liquor Scam : మద్యం కుంభకోణం కేసులో సిట్ రెండవ ప్రాథమిక చార్జీషీటును సిద్ధం చేసింది…. విజయవాడ ఏసీబీ కోర్టులో రెండో ఛార్జ్ షీట్ దాఖలు సోమవారమే సిట్ దాఖలు చేసింది. రెండవ ఛార్జ్ షీట్లో ముగ్గురి పాత్రపై కీలక ఆధారాలను పొందుపరిచినట్లు అధికారులు పేర్కొన్నారు. లిక్కరు స్కామ్లో (Liquor Scam) ఇప్పటికే కీలక నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల కాల్ డేటా రికార్డు, గూగుల్ టేక్ అవుట్, ఇతర ల్యాప్టాప్లోని వివరాలను ఛార్జ్ షీట్లో జోడించినట్లు అధికారులు వెల్లడించారు. 200 పేజీలతో రెండో ఛార్జ్ షీట్ను రెడీ చేసినట్లు సిట్ అధికారులు తెలుపుతున్నారు. మద్యం విధానం మార్పు, సిండికేట్ సమావేశాలు, ముడుపుల వ్యవహార విషయంలో కూడా ఈ ముగ్గురి పాత్ర కీలకమని ఉందని సిట్ అధికారులు నిర్ధారించారు. మద్యం ముడుపులను ఎలా సేకరించాలి, ఎక్కడ దాచాలి, బ్లాక్ను వైట్గా ఎలా మార్చాలి… అనే అంశాలపై బాలాజీ గోవిందప్ప సూచనలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మద్యం విధానం రూపకల్పనలో ధనుంజయ్ రెడ్డి అడుగడుగునా జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు. మద్యం ముడుపులు ఎవరి వద్ద నుంచి ఎంత తీసుకున్నారు.. ఎవరెవరికి చేరింది అనే అంశంపై కూడా వివరాలను సేకరించినట్లు తెలిపారు. విజయ్ సాయిరెడ్డి, మిథున్ రెడ్డిలతో ఈ ముగ్గురు ఫోన్లో మాట్లాడిన వివరాలను కూడా సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. లిక్కర్ సిండికేట్ సమావేశాలకు పలుమార్లు ధనుంజయ్ రెడ్డి హజరు అయినట్టు గూగుల్ టేక్ అవుట్ సాక్ష్యాలన సిట్ పొందుపరిచినట్లు సమాచారం. ఈ ముడువులలో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు కూడా కొంతవరకు సొమ్ములు వెనకేసుకున్నారని సిట్ వివరించింది. ఈ మొత్తాన్ని బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టారని.. దానికి సంబంధించిన సాక్షాయాలను సేకరించినట్లు సిట్ చెప్పుకొచ్చింది. గత నెల జులై 19వ తేదీన 305 పేజీలతో తొలి ఛార్జ్ షీటు (Charge sheet) దాఖలు చేసినట్లు సిట్ గుర్తు చేసింది. మూడు ట్రంక్ పెట్టెల్లో ఛార్జ్ షీట్తో పాటు వివిధ డాక్యూమెంట్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, హార్ట్ డిస్కులను కూడా కోర్టుకు సమర్పించిన సిట్.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :