విజయవాడ : సీఎం చంద్రబాబు తన అవినీతిపై ప్రజల దృష్టిని మళ్ళించేందుకే లేని లిక్కర్ స్కాంను (Liquor Scam) సృష్టించారని వైయస్ఆర్ సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నేరాలు, దుర్మార్గాలు చేయడం అవి ఎదుట పక్షంపై వాటిని నెట్టడం చంద్రబాబుకు అలవాటైందన్నారు. ఆయన భజన సంస్థలు వైకాంగ్రెస్ పార్టీపై విష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వారికి తగిన మూల్యమే చెల్లిస్తారన్నారు. విజయవాడలోని ఏసీబీ కోర్ట్ బయట మీడియాతో మాట్లాడుతూ కట్టుకథలు, పిట్టకథలతో లిక్కర్ స్కాం దర్యాప్తును రోజుకో మలుపు తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో దొరికన నోట్ల కట్టలకు, లిక్కర్ స్కాంలో అక్రమ కేసులు బనాయించిన వారికి అంటగట్టి కుట్రపూరితంగా బురదచల్లే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 2014- 19 మధ్య చేసిన అవినీతి నుంచి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు లిక్కర్ స్కాంను సృష్టించారు. ఈ స్కాంతో దుబాయ్, హైదరాబాద్లకు సంబంధం ఉందని, ఎన్నికల్లో ఈ డబ్బును ఖర్చు చేశారని, బంగారం కొన్నారని ఇలా నోటికి ఏది వస్తే దానిని మాట్లాడుతున్నారు. మొదట్లో మొత్తం రూ.50 వేల కోట్లు అన్నారు, తరువాత దానిని తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు రూ.3500 కోట్లు అంటున్నారు. కనీసం ఎక్కడ స్కాం జరిగిందో, ఎలా చేశారో కూడా సిట్ అధికారులకే ఒక స్పష్టత లేదు. వైయస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ స్కాంలో ఎక్కడ పాలసీని ఉల్లంఘించారన్నారు.
READ ALSO : Hindi.vaartha.com
READ MORE :