ఆరోపణ పూర్తి నిరాధారం: రమేష్
విజయవాడ : ఎపిలో ములకల చెరువులో బయటపడిన నకిలీ మద్యం (Liquor scam) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ1 నిందితుడుగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు తాజాగా సంచలనం సృష్టించారు. వైఎస్సార్సీ నేత జోగి రమేష్ చేసిన కుట్ర వల్లనే ఇదంతా జరిగిందని ఆయన ఓ వీడియోలో ఆరోపిం చారు. జోగి రమేష్ ఇచ్చిన రూ.3కోట్లుఆఫర్కు ఆశపడే ఇదంతా చేశానని జనార్దన్రావు చెబుతున్నాడు. వైఎస్సార్సీ హయాం లోనే పెద్ద ఎత్తున నకిలీ మద్యం వ్యాపారం చేశామని జనార్దన్ రావు తెలిపారు. పోలీసులు పట్టుకుంటే బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. అయితే వైఎస్సార్సీ ఓడిపోయిన తర్వాత నిఘా ఎక్కువకావడంతో నకిలీ మద్యం తయారీ ఆపేశామ న్నారు. ఏప్రిల్లో జోగి రమేష్ మద్యం తయారీ ప్రారంభించా లని సూచించారని పోలీసులకు చెప్పారు. ఒక వేళ దొరికతే.. ప్రభుత్వంపై బురదచల్లవచ్చని.. తంబళ్లపల్లెనుంచే ప్రారంభిం చాలని సూచించారన్నారు. దొరికితే అన్ని విధాలుగా అండగా ఉంటాననిచెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. అద్దెపల్లి నర్సింగరావు స్టేట్మెంట్ సంచలనం సృష్టి స్తోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్టణం సమీ పంలో జనార్దన్రావు కాల్లిస్టు ఆధారంగా పలువురిని విచారి స్తున్నట్లు సమాచారం!
Read also: బ్రహ్మపుత్రపై రూ.6.4 లక్షల కోట్లతో ప్రాజెక్ట్

పక్కా వ్యూహంతో బాబు కుట్ర: జోగి రమేష్
మద్యం (Liquor scam) కేసులో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తనను ఇరికించాలని సిఎం చంద్రబాబు (Chandrababu Naidu) ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. అద్దేపల్లి జనార్దన్తో ఆ కుట్రలో భాగంగానే అభియోగాలు చేయిస్తున్నారన్నారు. ఈ మేరకు రమేష్ ఒక ప్రకటన విడుదల చేసారు. నకిలీ మద్యం కేసులో పీకలలోతుకు ఇరుక్కుపోయారన్నారు. ఈ విషయం నుంచి ప్రజల దృష్టి మరలించడానికి నానా పాట్లు పడుతున్నారన్నారు. నకిలీ మద్యం విషయంలో ప్రజలు ఇప్పటికే ఒక అవగాహనతో ఉన్నారన్నారు, లిక్కరు మంచిదా, నారావారి మార్కు మద్యమా అని ప్రశ్నిస్తున్నారన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: