ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ కేసు(AP Liquor Case)లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు పలువురు ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు నిర్ధారణ కావడంతో, రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వారి కోసం వేట ప్రారంభించింది. విదేశీ నిందితులను అరెస్ట్ చేసి తిరిగి భారత్‌కు రప్పించేందుకు అధికార యంత్రాంగం వేగంగా చర్యలు తీసుకుంటోంది.
విదేశాంగ శాఖకు లేఖలు – రెడ్ కార్నర్ నోటీసులు జారీ
ఈ నేపథ్యంలో అధికారులు విదేశాంగ శాఖకు అధికారికంగా లేఖ రాసినట్లు సమాచారం. దుబాయ్, థాయ్‌లాండ్ దేశాల్లో ఎనిమిది మంది నిందితులు తలదాచుకున్నట్లు గుర్తించి, వారిపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. వీరి పూర్తి వివరాలు అక్కడి దేశ ప్రభుత్వాలకు అందజేసేందుకు కసరత్తు సాగుతోంది. నిందితుల చరిత్ర, ట్రావెల్ డాక్యుమెంట్లు, టెలికాం రికార్డులు సేకరించి వారిని గుర్తించారు.
ఇంటర్పోల్ సహకారం తీసుకునే యోచనలో అధికారులు
ప్రస్తుతానికి రెడ్ కార్నర్ నోటీసులు సరిపోకపోతే, నిందితుల అరెస్ట్ కోసం ఇంటర్పోల్ సహకారం తీసుకునే యోచనలో ఉన్నారు. అవసరమైతే వారిని భారతదేశానికి అప్పగించేందుకు పట్టు విడిచే ప్రసక్తే లేదని అధికారులు అంటున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని త్వరగా విచారణకు లోను చేసి న్యాయ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని తెలుస్తోంది.
Read Also : YCP : ఇంత మంచి చేసి ఓడిపోవడం షాకే – సజ్జల