గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాలు నిల్వగూడి కాదు, అది విద్యా, సాహిత్య, సంస్కృతి, విజ్ఞానాలకు కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశో ధకులు, పాఠకులు తమ జ్ఞానాన్ని పెంపొం దించుకునేందుకు గ్రంథాలయాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ గ్రంథాలయా (Library)ల ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే పుస్తకాలు ఇస్తున్న లోతైన జ్ఞానం, విశ్లేషణాశక్తి, ఆలోచనా సంపత్తి అమూల్యం. ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుండి నవంబర్ 21 వరకు భారతదేశంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. పుస్తకాల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం, చదవడం అలవాటు పెంపొందించడం ఈ వారోత్సవాల ప్రధాన లక్ష్యం. జ్ఞానం అనేది మనిషిని సంపూర్ణుడిగా మార్చే శక్తి. ఆ జ్ఞానా నికి నిలయమేవైతే గ్రంథాలయం. అదే ఈ వారోత్సవాల ద్వారా మరింత ప్రజల్లోకి చేరుతుంది. భారత దేశ చరిత్రలో గ్రంథాలయాలు విద్య, జ్ఞానం, ప్రజల్లో చైతన్యం పెంచడం లో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా స్వతంత్రపోరాట కాలంలో గ్రంథాలయాలు జాతీయ చైతన్యాన్ని ప్రజల్లో నాటడంలో ఒక శక్తివంతమైన వేదికగా నిలిచాయి. బ్రిటిష్ పాలన కాలంలో భారతీయులు విద్య, జ్ఞానం, సాహిత్యం ద్వారా స్వాతంత్య్ర భావాలను బలపరిచే ప్రయత్నం చేశారు. విదేశీ పాలకుల అన్యాయాలను ప్రజలకు తెలియజేయ డానికి, దేశభక్తి, జాతీయతను వ్యాప్తిచేయడానికి పుస్తకాలు, పత్రికలు, సమావేశాలు ముఖ్య సాధనాలయ్యాయి. ఈ క్రమంలో ప్రజల్లో చదువుపై ఆసక్తిని పెంచేందుకు గ్రంథా లయాలు ఏర్పాటు చేయబడ్డాయి. 1900 దశకం ప్రారం భంలోనే బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడులో గ్రంథాలయ (Library)ఉద్యమానికి ఉతమిచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత దేశంలోని అనేక ప్రాంతాలకు ఈ ఉద్యమం విస్తరించింది. తెలుగునాట గ్రంథాలయ ఉద్యమాలకు ఒక విశిష్ట చరిత్ర ఉంది.
Read Also: HYD: రాష్ట్రంలో రూ.4 లక్షల కోట్ల వక్ఫ్ భూములు హాంఫట్?

గ్రంథాలయాలు ప్రధాన వేదికలు
ప్రజల్లో చదవాలనే తపన, అవగాహన పెంపు, సంస్కరణాత్మక భావజాలం ప్రచారం కోసం గ్రంథా లయాలు ప్రధాన వేదికలుగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంతాల్లో ఈ ఉద్యమం సామాజిక, విద్యా, రాజకీయ రంగాల్లో ప్రభావవంతంగా సాగింది. 19వ శతాబ్దం చివరలో సామాజిక సంస్కరణ ఉద్యమాలు, జాతీయ స్వాతంత్య్ర ఉద్యమాలు ప్రజల్లో జ్ఞానోదయాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో ప్రజలలో చదువుపై ఆసక్తి పెరిగి, పుస్తకాల విస్తరణ కోసం గ్రంథాలయాల అవసరం ఏర్పడింది. తెలం గాణా ప్రాంతంలో గ్రంథాలయ ఉద్యమం స్వతంత్ర పోరా టం, ముఖ్యంగా నిజాం వ్యతిరేక పోరాటంతో సన్నిహిత సంబంధం కలిగి ఉంది. తెలంగాణాలో పాఠశాల విద్య అభివృద్ధి కష్టతరమైన కాలంలో, ఉస్మానియా విశ్వవిద్యాల యం (1918) స్థాపనతో ఉన్నతవిద్య విస్తరించింది. ఈ విజ్ఞాన వాతావరణంలో గ్రంథాలయాల ఆవశ్యకత పెరిగింది. నిజాంల దోపిడీ పాలన, ఉర్దూ భాష ఆధిపత్యం ఉన్న సందర్భాలలో ప్రజల్లో జ్ఞానోదయం, స్వేచ్ఛాభావాల వ్యాప్తి కి గ్రంథాలయాలు రహస్య కేంద్రాలుగా పనిచేశాయి. భారత దేశ చరిత్ర, దేశభక్తి కథలు, విప్లవ రచనలు ప్రజల్లో చైత న్యం పెంపొందించాయి. స్వరాజ్య అనే భావనను ప్రజలలో బలంగా నింపాయి. గ్రంథాలయాలు స్వాతంత్య్ర ఉద్యమా నికి సమాచార కేంద్రాలుగా పనిచేశాయి. పత్రికలు, పాంప్లె ట్లు, ప్రసంగాల ద్వారా ప్రజలు ఉద్యమ కార్యక్రమాలను తెలుసుకుని వాటిలో పాల్గొన్నారు. అక్షరాస్యత పెంపుద్వారా ప్రజలను జాగృతం చేయడంలో గ్రంథాలయాలు కీలకంగా మారాయి. ప్రజల్లో ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందించాయి.

ప్రజల్లో దేశభక్తి
మహాత్మా గాంధీ, బాల గంగాధర తిలక్, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ వంటి నేతల రచనలు గ్రంథా లయాల ద్వారా ప్రజలకు చేరాయి. వీటిలోని ఆలోచనలు స్వాతంత్ర భావజాలానికి బీజం వేశాయి. అనేక గ్రంథాల యాలు సమావేశ కేంద్రాలుగా ఉపయోగపడ్డాయి. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించింది. భారతదేశంలో గ్రంథాలయ ఉద్యమం కేవలం పుస్తకాలు సేకరించి భద్రపరచడం కోసం కాకుండా, ప్రజలలో అక్షరాస్యతను, చైతన్యాన్ని, జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన సామాజిక సాంస్కృతిక ఉద్యమంగా రూపు దిద్దుకుంది. ఈ ఉద్యమం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించింది.ఎందుకంటే గ్రంథాలయాల ద్వారానే మహాత్మా గాంధీవంటి జాతీయ నాయకుల సందేశాలు సామాన్య ప్రజలకుచేరాయి. తెలుగు భాష సంస్కృతి పరిరక్షణకు, తెలంగాణ సాంస్కృ తిక పునరుజ్జీవనానికి ఒక మైలురాయిగా నిలిచింది. నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘం ద్వారా గ్రంథాలయాల ఏర్పాటుకు, తెలుగు భాషా వికాసానికి కృషి చేశారు. నిజాం రాష్ట్రంలో నిరంకుశ పాలనలో, గ్రంథాలయాలు ఒక రకంగా ప్రజాస్వామ్య సాధనకు, తెలుగు భాషా పరిరక్షణకు, స్వాతంత్ర్యోద్య మానికి వేదికలుగా నిలిచాయి. వారి నిస్వార్ధ సేవ, దూర దృష్టి కారణంగానే ఈ ప్రాంతాలలో అక్షర జ్ఞానంవ్యాపించి, అనేక సామాజిక ఉద్యమాలకు పునాది పడింది. జాతీయ చైతన్యం పెరిగింది. ఆక్షరాస్యత, విద్య విస్తరించింది. దేశభక్తి భావాలు బలపడ్డాయి. ప్రజలు స్వేచ్ఛ ఉద్యమంలో పాల్గొ న్నారు. కొత్త ఆలోచనలు, సంస్కరణలు వ్యాప్తి చెందాయి. స్వాతంత్ర్యసంగ్రామానికి బలమైన మౌలిక వేదికగా మారా యి. భారత స్వాతంత్ర్య పోరాటంలో గ్రంథాలయాలు అమూల్యమైన సేవలు అందించాయి. ప్రజలను చదవడం, ఆలోచించడం, ప్రశ్నించడం వైపు మళ్లించాయి, జాతీయత, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలను ప్రజల్లో నింపాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమ విజయానికి గ్రంథాలయాలు మౌన సైనికుల్లా పని చేశాయి అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ గ్రంథాలయాల వారోత్సవాల్లో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్గ్రంథాలయాలు వివిధ కార్య క్రమాలు నిర్వహించి, పుస్తక ప్రదర్శనలు, పఠన పోటీలు, వ్యాసరచన కార్యక్రమాలు, సాహితీ సదస్సులు, రచయితల తో సంభాషణ కార్యక్రమాలు వంటివి నిర్వహించి విద్యార్థు ల్లో పఠనాభిరుచిని పెంచవలసిన ఆవశ్యకత ఉంది. పుస్తకాలు మనలో ఉన్న అనేక సందేహాలను తీర్చడమే కాక మనలో ఆలోచనా శక్తిని, పరిశీలనా దృక్కోణాన్ని పెంచుతాయి. గ్రంథాలయాలు మన సంస్కృతి, చరిత్రను భద్రపరిచే కేంద్రాలు, పాత పుస్తకాల ద్వారా పూర్వీకుల జ్ఞానం, వారి భావాలు, సంఘటనలు మనకు లభిస్తాయి. దాంతో మన జాతి పట్ల గౌరవం, బాధ్యత పెరుగుతుంది.
-డా. పూసపాటి వేదాద్రి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: