LAW : సోషల్ మీడియాలో (Social media) అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతా భావానికి గురిచేసే వారిపై ఇకపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురానున్నట్లు రాష్ట్ర హోమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడమే గాక అభద్రతా బావానికి గురి చేస్తున్నారని ఇకవై అలాంటి దుష్ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ విజయవంతంగా అమలుచేయడంతో ప్రతిపక్ష పార్టీ తట్టుకోలేక పోతుందని అందుకే సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాన్ని చేస్తుందని హోమంత్రి అనిత విమర్శించారు.

శ్రీకాంత్ పెరోల్ రద్దు పూర్తి విచారణకు హోంమంత్రి అనిత హామీ
ఒక్క ఆగష్టు లోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నేతన్నలకు నాయీబ్రాహ్ముణులకు 200వరకు ఉచిత విద్యుత్ స్త్రీశక్తి పధకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. శ్రీకాంత్ అనే వ్యక్తి పెరోల్ రద్దు చేశాం ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు మంత్రి అనిత పెరోల్ రావడం వెనుక ఏముంది ఎవరున్నారనే దానిపై పూర్తిగా విచారణ జరుపుతున్నాయని ఈ సంఘటనలో ఎవరున్నా వారిపై చట్టపక్రారం తగిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత (Home Minister Anita) స్పష్టంచేవారు. శ్రీకాంత్ విషయంలో ఎస్కార్ట్ సిబ్బందిపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి పెరోల్ వచ్చిందని జైలు అధికారిచెప్పారని వెంటనే అతని పెరోల్ రద్దుచేసి తిరిగి జైలుకు పంపామన్నారు. ఈ ఘటనలో పోలీస్ అధికారులు ఎవరున్నా వారిపై కూడా విచారణ అనంతరం తగినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అరుణ అనే మహిళ దిశా ఫౌండేషన్కు సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్రటరీ అని ఆమె నుంచి హోమ్ శాఖ పేషీకి ఫోన్ వచ్చిందని దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నామని ఆమె గురించి ఆమె వెనుకున్న వారి గురించి ఆరా తీస్తున్నా అని తెలిపారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :