తిరుమల శ్రీవారి ఆలయం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి, తమ కోరికలు తీర్చుకోవాలని ప్రార్థించడానికి ఇక్కడకు తరలివస్తారు. ఆరాధనతో పాటు భక్తులు తమ ఆర్థిక స్థోమతలకు అనుగుణంగా స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. హుండీలో డబ్బులు, బంగారం, వెండి వంటివి వేయడం సాధారణం. అయితే కొందరు భక్తులు టీటీడీ (TTD) ఆధ్వర్యంలో నడిచే పలు ట్రస్టులకు విరాళాలు ఇచ్చి సమాజానికి కూడా ఉపయోగపడేలా తమ దాతృత్వాన్ని చాటుకుంటారు.
ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు అందజేశారు
ట్రస్టులకు వచ్చే విరాళాలు చిన్న మొత్తాల నుంచి కోట్ల రూపాయల వరకు ఉంటాయి. వీటిని టీటీడీ వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంది. తాజాగా ఒక భక్తుడు తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని ముఖ్యంగా పేదల కోసం, ప్రాణాలను కాపాడే సేవ కోసం అందించడం విశేషం. ఈ విరాళం ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ (SV Pranadana Trust) కు అందజేశారు.ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన రోగులకు ఉచిత వైద్యం అందజేస్తారు. గుండె శస్త్రచికిత్సలు, కిడ్నీ డయాలసిస్, అవయవ మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలను కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందిస్తారు.

వైద్యం ఖర్చులు భరించలేక ఇబ్బందులు
చాలా మంది పేద కుటుంబాలు వైద్యం ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతుంటాయి. అలాంటి వారికి ఈ ట్రస్ట్ ఒక వరప్రసాదంలా మారింది.తిరుమల శ్రీవారికి శశి విద్యాసంస్థల ఛైర్మన్ భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు శశి విద్యాసంస్థల తరఫున రూ 1,01,11,111 విరాళం ఇచ్చారు. ఈ మేరకు శశి విద్యాసంస్థలు అధినేత బూరుగుపల్లి రవికుమార్ దంపతులు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి విరాళం డీడీని అందజేశారు. విరాళం అందజేసిన దాత రవికుమార్ దంపతులను టీటీడీ ఛైర్మన్ అభినందించారు. అలాగే బుధవారం టీటీడీకి ఖరీదైన ఎలక్ట్రిక్ బస్సు విరాళంగా అందజేశారు.
Read hindi news : hindi.vaartha.com
Read also: