యూరియా పంపిణీపై సమగ్ర వివరాలు వెల్లడించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం : రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు తోపాటు యూరియా పంపిణీ పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker AyyannaPatrudu) సోమవారం వెల్లడించారు. స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో వర్షం పడటం తో ఎప్పుడూ లేని విధంగా రైతులు వరి నాట్లు వేసుకున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని చివరి రైతు వరకు నీరు అందేలా కాలవలు శుభ్రపరిచే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కొంతమంది రైతులను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవసాయం గురించి తెలియని వారు కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
75 కిలోల యూరియా అవసరం ఉంటుందని
నర్సీపట్నం నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లో 10,274 హెక్టార్లలో పంటలు సాగుతున్నాయని, వాటికి 25,685 ఎకరాల మేరకు యూరియా అవసరమని వివరించారు. ఒక ఎకరానికి సగటు 75 కిలోల యూరియా (Urea) అవసరం ఉంటుందని, నిర్ణీత స్థాయిలో మూడు విడతలుగా రైతులకు పంపిణీ చేస్తామని చెప్పారు. విత్తనం వేసిన 15 రోజులకు 25 కేజీలు, గడ్డి నివృత్తి చేసిన తర్వాత మరో 25 కేజీలు, పంట పండిన సమయంలో మూడో విడతగా 25 కేజీలు ఇవ్వబడతాయని తెలిపారు. మొత్తం 25,685 ఎకరాల కోసం 1,926 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని చెప్పారు. ఇప్పటివరకు రైతు భరోసా కేంద్రాలు,పిఎసిఎస్లకు 1,055 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామని, అందులో 902 మెట్రిక్ టన్నులను రైతులుకొనుగోలు చేసినట్లు తెలిపారు.

కానీ రాజ్యాంగబద్ధంగా ప్రజల సమస్యల కోసం
ప్రస్తుతం స్టాక్ 152 మెట్రిక్ టన్నులు ఉండగా, మరో 15 రోజుల్లో అదనంగా 270 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. యూరియా అందుబాటులో ఉన్న కేంద్రాల వివరాలను కూడా వెల్లడించారు. అలాగే, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెబుతున్నారని, కానీ రాజ్యాంగబద్ధంగా ప్రజల సమస్యల కోసం అసెంబ్లీకి రావాలని సూచించారు. ఎమ్మెల్యే జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకపోవడం నేర మని అన్నారు. 18న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాండవ రిజర్వాయర్ చైర్మన్ కరక సత్యనారాయణ, గొలుగొండ మండలం పార్టీ అధ్యక్షులు అడిగర్ల నాని బాబు పాల్గొన్నారు.
Read hindi news:
Read Also: