ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల బీభత్సం కొనసాగుతోంది. గత వారం మొదలుకొని ఈ వారం వరకూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్ర ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, రవాణా వ్యవస్థ దెబ్బతింది. ముఖ్యంగా కృష్ణా నది (Krishna river) పరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావం మరింత పెరుగుతోంది.ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి 3,03,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. వరద ఒత్తిడిని నియంత్రించేందుకు అధికారులు బ్యారేజీ 69 గేట్లను ఎత్తి 2,97,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీటి విడుదల వల్ల కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించారు
పులిచింతల నుంచి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో రెండు మూడు గంటల్లోనే నీటి స్థాయి పెరగవచ్చని, దాంతో మొదటి ప్రమాద హెచ్చరిక (First Flood Warning) జారీ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని విభాగాలకు అలర్ట్ జారీ చేశారు.ఇప్పటికే అధికారులు కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు.ఉమ్మడి కృష్ణా జిల్లాలో అల్పపీడనం వల్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.. విజయవాడ నగరంలో వర్షం నీరు రోడ్ల మీద నిలిచిపోయింది.. రోడ్లు కాలువలలా మారాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు బయటకు వస్తోంది. ప్రజల జీవనం స్తంభించింది. మళ్లిస్తున్నారు.దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అన్ని స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది
కట్టెలేరు వంతెనపై వరద ఉధృతి పెరిగింది.. అధికారులు వరద నీటిని మళ్లిస్తున్నారు. మైలవరం, గన్నవరం, పామర్రు, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, పెనమలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లో వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.మరో వైపు ఏలూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న నీటితో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఏలూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సెలవులకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో.. గోదావరికి వరద పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. కుక్కునూరు-దాచారం మధ్య ప్రవహిస్తున్న గుండెటి వాగు పొంగిపోర్లుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల్ని ముందుగానే అధికారులు అలర్ట్ చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: