విజయవాడ : ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్ సంస్థకు భారీ పారిశ్రామికవాడ ఏర్పాటు చేసేందుకు వీలుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (Sri Potti Sriramulu Nellore District) కొడవలూరు మండలం రాచర్లపాడులో 2,776.23 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థ ఇక్కడ రూ.870 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, 70 వేల మందికి ఉపాధి లభించనుంది. పలు సంస్థలకు భూమలు కేటాయించేలా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్ఐపీబీ) ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
300 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి
స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ఇంటిగ్రేటెడ్ తయారీ, అసెంబ్లింగ్స్టింగ్, స్టోరేజ్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు వీలుగా తిరుపతి జిల్లాలో రౌతుసురమాల, బీఎస్పురం, కొత్తపాలెం గామల పరిధిలో 300 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ స్కైరూట్ ఏరోస్పేస్ రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 300 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఆర్టిలరీ కమ్యూనికేషన్ రాకెట్ షెల్ (Artillery communication rocket shell), టీఎన్టీ ఫిల్లింగ్, మల్టీమోడల్ హ్యాండ్ గ్రైనేడ్ తయారీ యూనిట్ కోసం హెచ్ఎఫ్సిఎల్ సంస్థకు వెయ్యి ఎకరాలు కేటాయించారు. ఇక్కడ సంస్థ రూ.1040 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

5 వేల మందికి ఉపాధి దక్కనుంది
870 మందికి ఉపాధి లభించనుంది. జె. కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థకు ప్రైవేటు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్ ఏర్పాటు కోసం విశాఖ జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెంలో కేటాయించారు. 63.67 ఎకరాలు ఈ సంస్థ రూ.237.71 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో 5 వేల మందికి ఉపాధి దక్కనుంది. అనకాపలి జిల్లా నక్పపలిల మండలం లోని నల్లమట్టిపాలెంలో ప్రైవేటు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు వీలుగా వరాహ ఆక్వా ఫామ్స్క 93 ఎకరాలు కేటాయించారు. అసోసియేషణ్ ఆఫ్ లేడీ అంత్రపెన్యూర్స్ ఆఫ్ ఇండియాకు వైఎస్ ఎంఎస్ఎంఈ ఇంటర్నేషనల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు చిత్తూరు జిల్లా కుప్పం మండలం పాలర్లపల్లెలో 13.70 ఎకరాలు కేటాయించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: