అనంతపురం: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై – దుష్ప్రచారం చేసేందుకు జనంలోకి వస్తున్న వైసీపీ నాయకులకు చెంప చెల్లుమనిపించడం ఖాయమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Paritala Sunitha) అన్నారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభమైన వారం రోజులు గడుస్తున్న నేపథ్యంలో మహిళల స్పందన తెలుసుకునేందుకు గురువారం ఆమె ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. గొరిదిండ్ల గ్రామం నుంచి ఆత్మకూరు వరకు ఆమె మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఎమ్మెల్యే సునీత కూడా జీరో ఫేర్ టికెట్ తీసుకున్నారు. అలాగే ఏ పని మీద ప్రయాణం చేస్తున్నారు. బస్సులో ఉచితంగా రావడం వలన మీకు ఎంత మేర డబ్బు ఆదాఅవుతోంది. ఈ పథకం రావడం వలన మీకు ఉపయోగం ఉందా.. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. వంటి వాటి గురించి తెలుసుకున్నారు. మహిళల నుంచి ఈ పథకం పై మంచి స్పందన కనిపించింది.

ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా స్త్రీ శక్తి పథకం (Women Shakti Scheme) అమలవుతుందా లేదా అనే అనుమానం చాలా మందికి ఉండేదన్నారు. కానీ మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాన్ని అమలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారన్నారు. దీనిపై మహిళల్లో కూడా చాలా సంతోషం వ్యక్తమవుతోందన్నారు. ఇప్పటికే 60లక్షల మందికి పైగా మహిళలు ప్రయాణం చేశారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయణం విషయంలో ప్రజల నుంచి కొన్ని విజుప్తులు వస్తున్నాయన్నారు. కర్ణాటక ప్రాంతానికి వెళ్లే బస్సుల్లో ఏపీ బార్డర్ వరకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించాలన్నారు. అలా చేయకపోతే చాలా మందికి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉందని.. ఇప్పటికే ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్నీ నెరవేరుస్తున్నట్టు చెప్పారు. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటివి వరుసగా అమలు చేస్తున్నామన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: