విజయవాడ (Land Acquisition) : రాష్ట్రంలో కార్పొరేట్ (Corporate in the state) పెట్టుబడిదారులకు లబ్దిచేకూర్చేందుకే బలవంతపు భూ సేకరణ చేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర పూర్వ. ప్రస్తుత సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. 2013 భూ సేకరణ, పునరావాసం చట్ట ప్రకారం పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం రైతులు, పేదల ఆమోదంతోనే భూ సేకరణ చేయాల్సి ఉండగా అందుకు విరుద్దంగా ప్రభుత్వాలు బలవంతపు భూసేకరణ చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో బలవంతంపు భూ సేకరణకు వ్యతిరేకంగా హైకోర్టు న్యాయవాధులు, నిర్వాసితులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య అధ్యక్షత వహించారు. చర్చా కార్యాక్రమానికి ముఖ్య అతిధిగాహాజరైన వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల కోసం బలవంతంగా భూములు లాక్కోవద్దన్నారు. గత పదేళ్లలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం 18 జిల్లాల్లో 1,91,472 ఎకరాల భూములను రైతుల వద్ద భోగాపురం ఎయిర్ పోర్టు, వంశధార, పోలవరం, గండికోట, నుంచి బలవంతంగా తీసుకున్నారని తెలిపారు. 2013 భూ సేకరణ చట్టాన్ని పాలకపక్షాలు తుంగలో తొక్కాయని ఆయన విమర్శించారు. ఇవి కాక మరో లక్ష ఎకరాలకు ప్రభుత్వం నోటీసులిచ్చిందన్నారు. ముఖ్యంగా వాన్పిక్, లేపాక్షిహబ్, సోలార్, గ్రీన్ఎనర్జీ, పోర్టుల పేరుతో సేకరించారన్నారు. అంతే కాకుండా కారిడార్లు, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు, సోలార్, బలడ్రగ్, ఎస్ఐడ్లు, హైవేలు, అమరావతి రాజధాని పేరుతో లక్షలాది ఎకరాలు భూములు సేకరించారని విఎస్ఆర్ పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా, వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు.

పోలవరం నిర్వాసితులకు నేటికీ న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూముల్చిన రైతులకు ఉపాధిలేక పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారన్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో గత పదేళ్ళలో రాష్ట్రంలో భూ సేకరణ, భూ సమీకరణ ద్వారా సేకరించిన భూములు ఎన్ని ఎకరాలు? కార్పొరేట్లకు కేటాయించిన భూములెన్ని? ఆయా పరిశ్రమల ద్వారా స్థానికులకు దక్కిన ఉద్యోగాలెన్ని? నిర్వాసితులకు పరిహారం, పునరావాసం లెక్కలపై సామాజిక అధ్యయనం చేయిస్తే ప్రభుత్వ డొల్లతనం బయట పడుతుందని అన్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం రైతులు, పేదల ఆమోదంతోనే భూ సేకరణ చేయాలని, పూర్తినష్టపరిహారం, పునరావాసం కల్పించిన తర్వాతనే ప్రాజెక్టు కల్పించాలన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :