విజయవాడ : కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఆందోళన కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ అమలకు ఇచ్చిన నోటిఫై ఫైల్స్ తక్షణమే రద్దు చేయాలని కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ సంఘాలు నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాడే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాల్లో 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ మార్పు చేసి మోడీ ప్రభుత్వం అమలకు నోటిఫై చేసిందన్నారు.
Read also: AP: మాజీ ఎంపీ రఘురామ టార్చర్.. కేసులోఐపిఎస్ సునీల్ కుమార్ కు నోటీసులు

Labour Codes should be repealed immediately
నల్ల చట్టాలను రద్దు చేయాలని
ఉత్పత్తిలో కీలకమైన కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీల ప్రయోజనాల కంటే పెట్టుబడు దారులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాల కంటే పెట్టుబడుదారులు, కార్పొరేట్లు ప్రయోజనాలే లక్ష్యంగా మోడీ (Modi) ప్రభుత్వం పనిచేస్తుందనడానికి లేబర్ కోడ్స్ అమలే నిదర్శనం అన్నారు. లేబర్ కోడ్స్ యజమానులకు తప్ప, కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కార్మిక, రైతులకు నష్టం చేసే లేబర్ కోడ్లను, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని లేకుంటే మోడీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: