కర్నూలులోని (IIITDM) విద్యార్థులు ఈ ఏడాది ప్లేస్‌మెంట్లలో అద్వితీయ విజయాలు సాధించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రీమియం టెక్ సంస్థల నుంచి పలు లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీలతో ఆఫర్లు రావడం ఇన్‌స్టిట్యూట్ ప్రతిష్ఠను మరింత పెంచింది. సాధారణ మరియు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ కష్టపడి సాధనతో టెక్ ప్రపంచంలో అడుగుపెడుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Read also: Mid Day Meal: నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు

Kurnool: కర్నూలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు
కోడింగ్ భాషల్లో పట్టు
ప్రకాశం జిల్లాకు చెందిన రైతు బిడ్డ మహేశ్ రెడ్డి రూ.65 లక్షల ప్యాకేజీతో సూపర్‌మనీ కంపెనీలో ఉద్యోగం సాధించడం ముఖ్య ఆకర్షణగా నిలిచింది. కోడింగ్ భాషల్లో పట్టు, ప్రాజెక్టుల అనుభవం, ఇంటర్వ్యూలో చూపిన నైపుణ్యంతో అతడు అగ్రశ్రేణి కంపెనీ దృష్టిని ఆకర్షించాడు. ఇదే కంపెనీ నుంచి ఝార్ఖండ్‌కు చెందిన నితీశ్ కుమార్ కూడా రూ.65 లక్షల ఆఫర్ పొందాడు. మొదటి ప్రయత్నంలో జేఈఈలో విఫలమైనా, లక్ష్యాన్ని వదలకుండా రెండో ప్రయత్నంలో మంచి ర్యాంకుతో ట్రిపుల్ ఐటీలో చేరి తన ప్రతిభను నిరూపించాడు.
రూ.53 లక్షల ప్యాకేజీతో
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన శ్రేయా పాండే మైక్రోసాఫ్ట్‌లో రూ.53 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించడం మరో ప్రత్యేక విజయంగా నిలిచింది. కోర్సు సమయంలో పొందిన ఇంటర్న్‌షిప్, అదనంగా నేర్చుకున్న టెక్నికల్ స్కిల్స్ ఆమెకు మేలు చేశాయి. ఈ విద్యార్థుల విజయం సిలబస్‌కు మాత్రమే పరిమితం కాకుండా, కోడింగ్, హ్యాకథాన్లు, ప్రాజెక్టులపై దృష్టి పెడితే పెద్ద అవకాశాలు దక్కుతాయని నిరూపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: