శ్రీకాళహస్తిలో రాయుడు హత్య కేసు మరో కీలక దశలోకి ప్రవేశించింది. జనసేన నాయకురాలు కోట వినుతకు సహాయకుడిగా పనిచేసిన రాయుడు హత్యపై ఇప్పటివరకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని లక్ష్యం చేస్తూ కొన్ని ఆరోపణలు వినిపిస్తుండగా, ఇప్పుడు మృతుడి సోదరి బయటకు తీసుకొచ్చిన వీడియో కొత్త సంచలనానికి దారితీసింది. తన అన్నను చంపింది వినుత వర్గమేనని, ఆ నేరాన్ని కావాలనే ఎమ్మెల్యేపై నెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆమె తీవ్రంగా ఆరోపించింది.
Read also: AP: బంగాళాఖాతంలో 48 గంటల్లో తుపానుగా మారనున్న అల్పపీడనం

An unexpected twist in the Srikalahasti Rayuda murder case
రాయుడు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను
విడుదల చేసిన వీడియోలో రాయుడి సోదరి మాట్లాడుతూ, తన అన్నతో పని చేయించుకుని చివరికి యోచించి ప్లాన్ ప్రకారం హత్య చేసినట్టు బాధతో పేర్కొన్నారు. అతడు అదృశ్యమైన రోజు నుండి అనేక అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకున్నాయని, వాటిని దాచిపెట్టేందుకు భారీగా డబ్బు ఖర్చు చేసి పెయిడ్ వీడియోలు చేయిస్తున్నారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. రాయుడు జీవించి ఉన్నప్పుడే బెదిరింపులు చేసి ఒక వీడియో రికార్డు చేయించారన్న ఆరోపణ కూడా ఆమె చేసింది.
తన అన్న మరణానికి సంబంధించిన నిజాలు వెలికి రావాలంటే రాయుడు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీస్తుండగా, పార్టీ ఇప్పటికే కోట వినుతను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాధిత కుటుంబం నేరుగా వినుత వర్గాన్ని తప్పుపడుతుండటంతో కేసు మరింత క్లిష్టంగా మారింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: