ఆర్టీసి చైర్మన్ కొనకళ్ల నారాయణరావు
విజయవాడ : రాష్ట్రప్రభుత్వం ఆర్టీసీలో అన్నీ విద్యుత్ బస్సులనే తీసుకోవాలని ఆర్టీసీ పాలకవర్గం నిర్ణయించిందని ఆ సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. వీటికోసం బస్టాండ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయనున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా తగిన వసతులు కల్పించాలని నిర్ణయించారు. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు (Konakalla Narayana Rao) అధ్యక్షతన పాలకమండలి తొలి సమావేశం విజయవాడలోని ఆర్టీసీ కార్యలయంలో జరిగింది. ఇందులో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
టెండర్లు పిలిచి
ఆర్టీసీ సంస్థ గతంలో 1,489 బస్సులు కొనుగోలు చేయగా, వీటిలో 904 బస్సులకు బాడీబిల్డింగ్కు టెండర్లు పిలిచి ఇచ్చారు. 518 ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రం రీటెండరు పిలిచి అదనపు ధరతో బాడీ బిల్డింగు కాంట్రాక్టరు కు అవకాశం కల్పించారు. దీనికి రూ.75 కోట్ల చెల్లింపుల అంశం బోర్డులో చర్చకు రాగా కొందరు సభ్యులు దీన్ని ప్రశ్నించారు. మళ్లీ టెండరు పిలిచి, ధర ఎందుకు పెంచాల్సి వచ్చిందో వివరాలన్నీ వచ్చే బోర్డు సమావేశం నాటికి తెలియజేయాలని అన్నారు. రాయలసీమ జిల్లాల్లో (Rayalaseema districts) బస్టాండ్ల పరిస్థితి ఎలా ఉందో కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

ప్రయాణం పథకం అమలు చేయాలని
మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ నెరవేర్చడంలో భాగంగా ఆగస్టు 15 మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా దీన్ని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ అధ్యక్షతన ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) పాలక మండలి సమావేశమైంది. విజయవాడలోని ఆర్టీసీ కేంద్ర కార్యాలయంలో జరిగిన భేటీకి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్లు, ఈడీలు, సహా బోర్డు సభ్యులుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీకి సంబంధించి పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానాలు చేశారు.
APSRTC ను ఎప్పుడు స్థాపించారు?
APSRTC ను 1958లో స్థాపించారు. అప్పటినుంచి ఇది ప్రజలకు చౌక, విశ్వసనీయ బస్సు సేవలను అందిస్తోంది.
APSRTC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
APSRTC ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: AP High Court: రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ల వద్ద సిసి కెమెరాల ఏర్పాటుపై అడ్వోకేట్స్ కమిటీ