ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS)లో కీలక మార్పుల వైపు అడుగులు వేస్తోంది. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రేషన్ కార్డుదారులకు బియ్యం బదులు నగదు చెల్లించే లేదా చిరుధాన్యాల ఎంపిక కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

రాజపేటలో చౌకధరల దుకాణం ప్రారంభం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రాజపేటలో నిన్న జరిగిన కార్యక్రమంలో రేషన్ పంపిణీ ప్రారంభోత్సవానికి మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. చౌకధరల దుకాణం ద్వారా రేషన్ పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రేషన్ పంపిణీలో అవినీతిని నిరోధించడంపై మంత్రి స్పష్టతనిచ్చారు.
గత ప్రభుత్వం అవినీతిపై ఆరోపణలు
గత ప్రభుత్వ హయాంలో పేదల బియ్యాన్ని మాఫియా పక్కదారి పట్టించి వేలకోట్ల రూపాయలు దోచేశారు. ఇంటింటి రేషన్ పేరుతో కార్డుదారులనూ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అందుకే రేషన్ బియ్యం మాఫియాను అరికట్టడంతో పాటు ప్రజలను నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న కూటమి సర్కార్ చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది.
బియ్యం బదులు నగదు
ఇకపై ప్రతి నెలా ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు చౌకధరల దుకాణాల్లో రేషన్ అందుబాటులో ఉంటుంది. కార్డుదారుల ఇష్టప్రకారం బియ్యం బదులు నగదు, రాగులు, సజ్జలు ఇతర చిరుధాన్యాలు ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అని మంత్రి వెల్లడించారు.
ఇకపై రేషన్ పంపిణీ ప్రతి నెలా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు మాత్రమే చౌకధరల దుకాణాల ద్వారా జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా పంపిణీ వ్యవస్థపై పర్యవేక్షణ మెరుగవుతుంది. అవినీతి అవకాశాలు తగ్గుతాయి.
Read also: Gorukallu Reservoir : కర్నూలు లో ప్రమాదంలో గోరుకల్లు రిజర్వాయర్