కుప్పం : ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఉద్యోగులకు సిఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని ప్రభుత్వ విప్, కడ పిఎసి చైర్మన్ కంచర్ల(Kancharla Srikanth) శ్రీకాంత్ పేర్కొన్నారు.
Read Also: Telangana Bandh : కోనసాగుతున్న బీసీ సంఘాల రాష్ట్ర బంద్

శుక్రవారం స్థానిక మండల కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఏర్పాటుచేసిన ‘థ్యాంకూ సిఎం సార్’ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు నాయుడు, డి. సిఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చిత్రపటాలకు ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, పికెఎం ఉడా చైర్మన్ బిఆర్ సురేష్ బాబు, ఎపిఇడబ్ల్యుసి చైర్మన్ రాజశేఖర్ తదితరులు పాలాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా కంచర్ల శ్రీకాంత్(Kancharla Srikanth) మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం దీపావళి కానుకగా పంచాయతీల వర్గీకరణ, పదోన్నతులు కల్పించాలని నిర్ణయించడం సంతోషకరమైన అంశం అన్నారు. కార్యక్రమంలో కడ సభ్యులు రామచంద్ర, సుగుణమ్మ, పార్టీ అధ్యక్షులు రాజగోపాల్, కాణిపాకం వెంకటేష్, కాణిపాకం ఆలయ సభ్యులు నరేష్, వసంతమ్మ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: