తిరుమల శ్రీవారి లడ్డూ(Kalthi ghee) ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా, మాజీ టీటీడీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన విజయవాడకు రాలేనని చెప్పడంతో, సిట్ బృందం నేరుగా హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే విచారణ చేపట్టింది.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ సమయంలో లడ్డూల కోసం నెయ్యి సరఫరా చేసిన కంపెనీలు, వాటితో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఛైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై అధికారులు ప్రధానంగా సమాచారం సేకరిస్తున్నారు. ఈ కేసు విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Read also: రాహుల్ గాంధీ కేసులో స్టే పొడిగించిన సుప్రీంకోర్టు

నెయ్యి సరఫరా ఒప్పందాలు, పీఏ సమాచారంతో విచారణ
ఈ కల్తీ నెయ్యి(Kalthi ghee) కేసు దర్యాప్తులో భాగంగా, ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) అప్పన్నను సిట్ అధికారులు అరెస్టు చేసి విచారించారు. పీఏ అప్పన్న అందించిన కీలక సమాచారం ఆధారంగానే ఇప్పుడు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ ద్వారా నెయ్యి సరఫరాలో జరిగిన అవకతవకలు, ఒప్పందాల వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసుపై సిట్ దర్యాప్తు పూర్తి అయిన తర్వాత తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: