
ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ (ఏఐ) ((AI)) నాగరికతలో జీవిస్తున్న మనం ఇంకా బూజుపట్టిన భావజాలంలోనే మగ్గిపోవడం విచారకరం. ఒకవైపు ఉన్నత విద్య, ఉపాధి కోసం మన పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్నాం. మతాలకు, కులాలకు అతీతంగా క్రైస్తవదేశాలు, ముస్లిందేశాలు, కమ్యూనిస్టు దేశాలనే బేధం లేకుండా పంపిస్తున్నాం. అప్పుడు అడ్డురాని కులం, మతభావం, జాతీ విభేదాలు ఇప్పుడు ఇక్కడెందుకు వస్తున్నాయి? మతం, కులం ఇవన్నీ మనల్ని అధఃపాతాళానికి
తీసుకెళ్లేవే.
మతంకన్నా మానవత్వం మిన్న అనే విషయం మనకు తెలిసినా ఆచరణలో మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తిస్తాం. ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో రెండు తెగలమధ్య జరుగుతున్న పోరులో సామాన్యప్రజలు నలిగిపోతున్నారు. ఆ వివరాలు ఏమిటో మీరే చదవండి.. నెల్లూరు (Nellore) జిల్లాలోని కైకలూరులో రెండు కులాల మధ్య చిచ్చు, నెల్లూరు జిల్లాలోని కైకలూరు రెండు కులాల మధ్య గతకొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులా చెలరేగుతున్నాయి.
భవిష్యత్తులో ఇలాంటి గొడవలు జరగకుండా చూసుకుందామని
గతకొన్ని రోజుల క్రితం కైకలూరు (Kaikaluru) లో కాపు కులస్తులకు, ఎస్సీకులస్తులకు మధ్య విభేదాలు వచ్చి స్వల్పంగా ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల పెద్దలు కూర్చోని, భవిష్యత్తులో ఇలాంటి గొడవలు జరగకుండా చూసుకుందామని మాట్లాడుకున్నారు. ఈ సంఘటన పోలీసుల వరకు వెళ్లడంతో పోలీసులు కూడా ఈ విషయం సున్నితమైనది కావడంతో, రెండువర్గాల మధ్య నిఘాను పెట్టి, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.
అయితే ఈనెల వినాయక విగ్రహం నిమర్జనం (Immersion of the Ganesha idol) లో ఊరేగింపులో ఎస్సీకి చెందిన ఓ వ్యక్తి కాపు ఊరేగింపులోకి వచ్చాడు. దీంతో కాపు కులస్తులు ఆ వ్యక్తిపై దాడి చేయడం, దీనికి రివెంజ్ ఎస్సీ వారు ప్రతి దాడి చేయడంతో కాపు, ఎస్సీలమధ్య గొడవలు జరిగాయి. దీంతో ఒకరిపై ఒకరు కేసులను పెట్టుకున్నారు.
మరో కారంచేడు, చుండూరు సంఘటనకు దారితీస్తుందేమో
కాపు కులస్తులు తమ మార్గంలో ఎస్సీలు రాకూడదని హుకుం జారీ చేయడంతో ఇది మరో కారంచేడు, చుండూరు సంఘటనకు దారితీస్తుందేమో అని ఇక్కడి ప్రజలు భయపడుతున్నారు. ఏలూరు డిఎస్పీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఎస్సీలు మాత్రం తమకు అన్యాయం జరుగుతున్నదని,
కాపుల మార్గంలో నడిచేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఈ ఉదంతం మీడియా కూడా పెద్దగా కవర్ చేయకపోవడం గమనార్హం. ఏదిఏమైనా పాలకులు, ప్రజాప్రతినిధులు ఈరెండు వర్గాల మధ్య జరుగుతున్న విభేదాలను శాశ్వతంగా పరిష్కరించి, ప్రజలు శాంతియుతంగా జీవించేందుకు దోహదం చేయాలని కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: