Kadapa Municipal Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో వైఎస్సార్‌సీపీకి ఊహించని పరాభవం ఎదురైంది. దశాబ్దాలుగా ఆ పార్టీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూటమి పార్టీల జోరు స్పష్టంగా కనిపించింది.

నాలుగు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీడీపీ
కడప జిల్లా వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు సత్తా చాటాయి. జిల్లాలోని కీలకమైన బద్వేల్, రాజంపేట, రాయచోటి అలాగే మైదుకూరు పురపాలికలను సైతం టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించి తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ ఫలితాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. ఫలితాలు వెలువడిన వెంటనే నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
Read also: Cyclonic Storm Murasu : పల్నాడుపై పగబట్టిన ‘మురసు’
Kadapa Municipal Elections: యర్రగుంట్లను దక్కించుకున్న బీజేపీ
కేవలం టీడీపీయే కాకుండా, ఆ పార్టీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూడా సత్తా చాటింది. కడప జిల్లాలోని మరో కీలక ప్రాంతమైన యర్రగుంట్ల నగర పంచాయతీని బీజేపీ కైవసం చేసుకుంది. ఈ విజయంతో జిల్లాలోని మొత్తం ఐదు పురపాలక స్థానాలను కూడా టీడీపీ-బీజేపీ కూటథి సర్వస్వం దక్కించుకున్నట్లయింది. కూటమి సమన్వయం ఈ ఎన్నికల్లో సఫలమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాయలసీమ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా రాజకీయంగా బలమైన పునాది ఉన్న కడప జిల్లాలో, వైఎస్సార్‌సీపీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ సొంత గడ్డపైనే పార్టీ ఖాతా తెరవలేకపోవడం ఆ పార్టీ నాయకత్వానికి మింగుడుపడడం లేదు. ఈ అనూహ్య ఫలితాలు రాబోయే రోజుల్లో రాయలసీమ రాజకీయ సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ప్రజా తీర్పులో మార్పునకు ఇవి నిదర్శనమని కూటమి నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :