AP Municipal Election Results : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శించారు. సాయంత్రం 5 గంటల వరకు వెల్లడైన ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు పలు మున్సిపాలిటీల్లో విజయం సాధించారు. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందగా, జనసేన, బీజేపీ అభ్యర్థులు కూడా తమ పట్టును చాటుకున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
Read ALso : జగ్గయ్యపేటలో వాసిరెడ్డి పద్మ కుమార్తె ఘన విజయం

పార్టీ వారీగా విజయం సాధించిన అభ్యర్థులు
టీడీపీ తరఫున ఇచ్ఛాపురంలో లీలారాణి, పలాసలో గంగాభవాని, జగ్గయ్యపేటలో వినీత, పెద్దాపురంలో సూరి బాబురాజు, మాచర్లలో సుష్మ, కొవ్వూరులో విజయలక్ష్మి, ఆకివీడులో బిలాల్, నూజివీడులో ఇళయరాజా, మండపేటలో అజయ్ విజయం సాధించారు. జనసేన తరఫున నరసాపురంలో శైలజ, నిడదవోలులో జ్యోతి, గొల్లప్రోలులో తమ్మయ్య నాయుడు గెలుపొందారు. బీజేపీ తరఫున ఎలమంచిలిలో రమాకుమారి, గూడూరులో సునీత బాయి విజయం సాధించారు. ఇలా సాయంత్రం 5 గంటల వరకు వెల్లడైన వివరాల ప్రకారం టీడీపీ 9, జనసేన 3, బీజేపీ 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. మొత్తం 14 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించినట్లు ప్రాథమిక ఫలితాలు సూచిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :