యెమెన్‌లో హత్యకు సంబంధించి నిందితురాలిగా భావించబడుతున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) ప్రస్తుతం అక్కడి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు అంతర్జాతీయంగా తీవ్ర సంచలనంగా మారింది. నిమిష ప్రియకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించడంతో ఆమె రక్షణ కోసం భారతదేశం లోపల, వెలుపల ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
కేఏ పాల్ స్పందన – “విడుదల సమీపంలో ఉంది”
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ (KA Paul) ఈ అంశంపై ‘ఎక్స్ (ట్విట్టర్)’ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “బిగ్ బ్రేకింగ్ న్యూస్ – యెమెన్ జైలులోని భారతీయ నర్సు నిమిష ప్రియ విడుదల కాబోతోంది” అని ట్వీట్ చేశారు. ఆమెను విడుదల చేయించేందుకు (To be released) తాను కృషి చేస్తున్నానని, ఈ విషయంలో త్వరలో సానుకూల పరిణామం వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
యెమెన్ అధికారుల నుంచి ఇంకా అధికారిక ప్రకటన లేదు
కేఏ పాల్ (KA Paul) చేసిన ప్రకటన నిమిష ప్రియ కుటుంబ సభ్యుల్లో, కొంత ఉత్సాహాన్ని రేకెత్తించినప్పటికీ, యెమెన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఆధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇది ఇంకా అటు భారత విదేశాంగ శాఖకు, ఇటు కుటుంబానికి కూడా స్పష్టత ఇవ్వని అంశంగా మిగిలింది.
కేంద్ర ప్రభుత్వం కృషి కొనసాగిస్తూనే ఉంది
నిమిష ప్రియను రక్షించేందుకు భారత ప్రభుత్వం యెమెన్ అధికారులతో నేరుగా సంప్రదింపులు జరుపుతోంది. విదేశాంగ శాఖ ఆమె కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని, న్యాయపరమైన మద్దతుతో పాటు దౌత్యపరమైన చర్చలు కూడా కొనసాగిస్తోంది .
Read hindi news: hindi.vaartha.com
Read also: Cultural Program: రామకృష్ణ నాట్యమండలి స్వర్ణోత్సవ వేడుకలు కళారంగానికి స్ఫూర్తిదాయకం