AP: రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ముమ్మరంగా సాగుతుందని ధాన్యం కొనుగోలు లో రైతులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె. విజయానంద్(K. Vijayanand) అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ధాన్యం కొనుగోలు గణాంకాలను జిల్లాల వారీగా అడిగి తెలుసుకుని పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు సరిపడినన్ని గోనెసంచులు అందుబాటులో ఉంచాలన్నారు.
Read Also: Google Data Center : గూగుల్ డేటా సెంటర్ కు 480 ఎకరాలు కేటాయించిన ఏపీ సర్కార్

రబీ సీజన్ ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో రైతుల నుండి ఫిర్యాదులు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఫిర్యాదులు(complaints) వస్తే అధికారులు స్పందించి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. రబీ సీజన్ ప్రారంభం కానున్నందున అన్ని రకాల రసాయనిక ఎరువుల కొరత రాకుండా ముందుస్తుగానే ఎరువులు నిల్వ(Fertilizer storage) చేసుకుని రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎరువుల డింమాండ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎరువుల లభ్యతపై జిల్లాల వారీగా సమీక్షించారు. దిత్వా తుఫాన్ వల్ల కలిగిన నష్టాలను నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ వల్ల దెబ్బతిన్న రహదారులకు మరమత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సీజనల్ వ్యాధులు నియంత్రణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టిసారించాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ కలెక్టర్లకు సూచించారు. స్కర్బ్ టైఫస్(Scrub typhus) వ్యాధిపై స్టాండర్డ్ గైడ్లైన్స్ జారీ చేసినట్లు చెప్పారు. టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సిఐఐ సమ్మిట్లో ఎంఓయులు కుదుర్చుకున్న కంపెనీల ఏర్పాటుపై కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పరిశ్రమలశాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్.యువరాజ్ సమావేశంలో వర్చువల్గా పాల్గోని కలెక్టర్లకు సూచించారు. వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి వీర పాండ్యన్ మాట్లాడుతూ అల్లూరి మన్యం జిల్లాలో మలేరియా వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్కర్బ్ టైఫస్ వ్యాధి నియంత్రణకు వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పరిక్షలు చేయాలని, ప్రతి శనివారం డ్రైడే నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఅండ్పిఆర్ సంచాలకులు కెఎస్. విశ్వనాధన్, ఆర్టీజిఎస్ సిఈఓ ప్రఖరైజైన్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: