విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా ఏపీట్రాన్స్ కొ ఆధ్వర్యంలో దాదాపు రూ.12,000 కోట్ల విలువైన ట్రాన్స్మిషన్ నెట్ వర్క్ ప్రాజెక్టులను చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ (CS K. Vijayanand) తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ట్రాన్స్కో ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై గురువారం జేఎండీ కీర్తి చేకూరి, డైరెక్టర్లుఏ కె వి భాస్కర్, .వెంకటేశ్వర రావు, సీఈ సుధీవన్ కుమార్ తో పాటు రాష్ట్రం లోని ట్రాన్స్కో యస్ ఈ లతో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
పురోగతి నివేదికలు
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చేందుకు, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు, విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ బలోపేతం చేసే లక్ష్యం లో భాగంగా ఏపీట్రాన్స్కో (APTransco) దాదాపు రూ.12,000 కోట్లకు పైగా విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులను చేపడుతోందని, వీటిలో గత రెండు నెలల్లో రూ.155.04 కోట్లు విలువ చేసే 7 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. అలాగే రూ.8,131 కోట్లు విలువ చేసే 62 ప్రాజెక్టులు ప్రస్తుతానికి వివిధ దశల్లో ఉన్నాయని, రూ.363.13 కోట్లు విలువచేసే 5 ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుమతులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.మరో రూ.3,614 కోట్లు విలువ చేసే 31 విద్యుత్ ప్రసార పనులకు టెండర్లు ఆహ్వానించినట్లు సిఎస్ తెలిపారు.

రాష్ట్రంలో ప్రత్యేకించి
ఈ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలనీ ఏపీట్రాన్స్కో అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేకించి పారిశ్రామిక కారిడార్లు, పట్టణ క్లస్టర్ల వంటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో ప్రాజెక్టులపై రోజువారీ స్థాయిలో సమీక్షించాలని, వారానికోసారి పురోగతి నివేదికలు సమర్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థలతో సమన్వయం తో ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలని, ప్రత్యేకంగా రాజధాని ప్రాంతంలోని ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇది రాష్ట్ర అభివృద్ధి (Development of the state) కి కీలకమని పేర్కొన్నారు. నిర్మాణ పనులన్నీ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, థర్డ్ పార్టీ ద్వారా నాణ్యత పరీక్షలు చేయాల చేయాలని క్రమం తప్పకుండా ఆడిట్లు నిర్వహించాలని ఆదేశించారు.
విజయానంద్ తొలి డ్యూటీ ఎక్కడ చేశారు?
1993లో అసిస్టెంట్ కలెక్టర్‌గా ఆదిలాబాద్‌లో టాస్క్ ప్రారంభించారు .
కె. విజయానంద్ ఎవరు?
1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. డిసెంబర్ 31, 2024న ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Chandrababu Naidu: బాలుడు మృతి పై సీఎం చంద్రబాబు సీరియస్ విచారణ జరపాలని ఆదేశాలు