విజయవాడ : రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునే విధంగా లక్షాయాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కె.విజయానంద్ (K. Vijayanand) జిల్లా కలక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. స్వర్ణ ఆంధ్ర పి4 ఫౌండేషన్, సిటీ గ్యాస్ పంపిణీ నెట్ వర్కుకు సంబంధించిన అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర పి4 కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి మార్గదర్శకాలు ద్వారా దత్తత చేసుకోవాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 6 లక్షల 57వేల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత (adoption) తీసుకోవడం జరిగిందని అన్నారు. మిగతా లక్షయాన్ని కూడా త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు 15లక్షల బంగారు కుటుంబాలను తీసుకోవాలని అదే విధంగా నీడ్ అసెస్మెంట్ సర్వేను ఆగష్టు 5వ తేదీ లోగా పూర్తి చేయాలని కలక్టర్లను ఆదేశించారు.

బంగారు కుటుంబాల దత్తతను వేగవంతం చేయండి – కలెక్టర్లకు సిఎస్ విజయానంద్ (K. Vijayanand) ఆదేశాలు
ఇప్పటికే బంగారు కుటుంబాలను, మార్గ దర్శకులను గుర్తించినందున మార్గదర్శులచే బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సిఎస్ విజయానంద్ కలెక్టర్లు ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 540 వరకు కీపెర్ఫార్మెన్స్ ఇండికేటర్లను గుర్తించి అన్ని శాఖలకు పంపడం జరిగిందని వాటి గురించి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వాటి లక్ష్య సాధనకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు. రానున్న కలక్టర్ల సమావేశంలో కీపెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై (Key Performance Indicators) ప్రత్యేకంగా చర్చించడం జరుగుతుందని కావున దీనిపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. తదుపరి అనంతపురం, చిత్తూరు, కడప, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్కుకు సంబంధించిన అంశాలపై సిఎస్ విజయానంద్ ఆయా జిల్లాల కలక్టర్లు ఇతర అధికారులతో సమీక్షించారు.
ఆగస్టు మొదటి వారంలో సీఎం సమీక్ష, బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశం
ఈసమావేశంలో రాష్ట్ర ప్రణాళికా మరియు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర పి4 ఫౌండేషన్ పై ఆగస్టు మొదటి వారంలో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని కావున బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియ లక్ష్యాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. అదే విధంగా కీ పెర్ఫార్మెన్స్ ఇండికే టర్లకు సంబంధించి 540 ఇండికేటర్లను గుర్తించి అన్ని జిల్లాలకు వివరాలను తెలియజేయడం జరిగిందని చెప్పారు. ఆజాబితా సిపిఓల వద్ద ఉందని కావున వెంటనే సిపిఓ, జిల్లా అధికారులతో సమావేశమై జిల్లా అధికారులకు తెలియజేసి వాటి లక్ష్య సాధనకు కృషి చేయాలని చెప్పారు.
బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియ కోసం ఏ తేదీ వరకు లక్ష్యాన్ని పూర్తి చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు?
ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో మొత్తం ఎన్ని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లను గుర్తించారు?
రాష్ట్ర వ్యాప్తంగా 540 కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లను గుర్తించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: AP: అమరావతి జౌటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు ఆరు నెలల్లో ప్రారంభం!