విజయవాడ : ఏపీ హైకోర్టు (AP HIGH COURT) అదనపు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీరజ్సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేయించారు. తుహిన్ నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. తుహిన్కుమార్ సవలం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కత్తుల కవిటి గ్రామం. 1994 మార్చి 9న బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఆయన పేరు నమోదైంది. 2000-2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా సేవలందించారు. 2010-14 మధ్య జీఎంసీ తరపున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్గా భాధ్యతలు నిర్వర్తించారు. 2016-17లో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ అదనపు అడ్వకేట్ జనరల్ పి.సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారధి, పలువురు ఇతర రిజిష్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ, ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :