ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగే అవకాశాల మధ్య, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ (Quash Petition) పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు (జూలై 1, 2025) విచారణ చేపట్టనుంది.

కేసు నేపథ్యం:
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో, ఇటీవల జరిగిన జగన్ పర్యటన సమయంలో ఒక వైసీపీ కార్యకర్త సింగయ్య అనుకోకుండా జగన్ వాహనం కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. జగన్ సహా పలువురు పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజకీయ కక్షలే కారణమా?
ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని పేర్కొంటూ, జగన్ ఇతర నిందితులు కోర్టును ఆశ్రయించారు. తమపై పెట్టిన కేసును రద్దు చేయాలని కోరుతూ వేర్వేరుగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేయగా, వాటన్నింటినీ కలిపి ఉన్నత న్యాయస్థానం విచారిస్తోంది. ఈ కేసు, జగన్ క్వాష్ పిటిషన్, తదితర పరిణామాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్షంగా రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారాయి.
Read also: Red Sandalwood: ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష
Chevireddy Bhaskar Reddy: లిక్కర్ స్కామ్ లో సిట్ కస్టడీకి చెవిరెడ్డి