మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సత్తెనపల్లిలోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడి ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై స్పందించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలు అంబటిని భౌతికంగా అంతం చేసేందుకే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ వారు ప్రేక్షక పాత్ర వహించారని, పోలీసుల సమక్షంలోనే దుండగులు బూతులు తిడుతూ, రాళ్లు రువ్వుతూ దాడికి తెగబడ్డారని జగన్ మండిపడ్డారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Medak Municipal Election: కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి
అంబటి రాంబాబు రియాక్షన్ వెనుక ఉన్న నేపథ్యాన్ని వివరిస్తూ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎదుటివారు నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ, రెచ్చగొడుతుంటే ఏ మనిషైనా సహజంగానే ప్రతిస్పందిస్తారని, అంబటి కూడా అదే రీతిలో స్పందించారని జగన్ సమర్థించారు. అయితే, ఆవేశంలో జరిగిన పొరపాటును గ్రహించి, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని ప్రకటించడం అంబటి ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమని జగన్ కొనియాడారు. తప్పును ఒప్పుకోగల ధైర్యం, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టే అంబటి వివరణ ఇచ్చారని, అలాంటి వ్యక్తిని కూడా టార్గెట్ చేయడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న వరుస దాడులను జగన్ తీవ్రంగా పరిగణించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా హింస కొనసాగుతోందని, దీనిపై ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. దాడి చేసిన వారిని వదిలేసి, బాధితులపైనే కేసులు పెట్టడం ఏ రకమైన న్యాయమని ఆయన ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేయాలని, అంబటి ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com