వైఎస్సార్సీ(YSRCP) ప్రభుత్వ హయాంలో రైతన్నల జీవనం బంగారు బాటలాగా సాగితే కూటమి ప్రభుత్వ పాలనలో రైతన్నల దుస్థితి అట్టడుగు స్థాయికి చేరుకుంది అని అరటిపంట చెట్టు మీదనే మాగి కుళ్లిపోతూ నెలపాలు అవడంతో రైతన్నల జీవితాలు నేలకొరుగుతున్నాయనీ, రైతన్నల ధరీకి కూడా గిట్టుబాటుధర(Affordable price) చేరడంలేదు, రెండు సంవత్సరాలు పాలన పూర్తిఅయిన ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత బీమాల ఊసే లేదని తీరు మారకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని మాజీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(JAGAN) అన్నారు. బుధవారం రెండవ రోజు పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపీ వైయస్ అవి నాష్ రెడ్డితో కలిసి అరటిపంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను అడిగి పంట నష్టాలను తెలుసుకున్నారు.
Read Also: Krishna dispute: ‘కృష్ణా’ హక్కులపై చంద్రబాబు స్పష్టమైన హెచ్చరిక

వ్యాపారులు ముందుకు రావడం లేదు
అరటి పంటను కొనుగోలు చేసే వ్యాపారులు ముందుకు రావడం లేదు అని అరటి కాయలు కోయడానికి అయ్యే ఖర్చు కూడా రావడం లేదు అని రైతులు మాజీ సీఎంకు వారి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియా సమా వేశంలో మాట్లాడుతూ 2024లో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందని కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని వాటిని ఆచరణలోనికి తీసుకురాక పోవడం దారుణమని అన్నారు. 600 మెట్రిక్ టన్ను స్టోరేజ్ చేసుకునే సామర్థం ఉందన్నారు. కేవలం విద్యుత్ ఛార్జీలు కట్టాల్సి వస్తుందన్నారు. ఎరువులు కూడా బ్లాక్ లో కొనే పరిస్థితి రైతుకు వచ్చిందన్నారు.
కూటమి ప్రభుత్వము వచ్చిన 18 నెలల్లో 16 సార్లు విపత్తులు రావడంవలన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్న ప్రభుత్వం రైతులకు బోడి సున్నా చుట్టింది అన్నారు. ఈ క్రాప్ చేసి వైసీపీ ప్రభుత్వంలో 84 లక్షల మందికి ఉచిత పంట బీమా కట్టడం జరిగిందని, ప్రస్తుతం 18 లక్షల మంది మాత్రమే బీమా కట్టుకోవడం జరిగిందన్నారు. రైతులు వేసిన పంటలకు ఈక్రాప్ చేసే పరిస్థితి కూడా లేదన్నారు. వైసిపి(YCP) ప్రభుత్వంలో అరటిపంటను అనంతపురం, తాడపత్రి నుంచి ఢిల్లీ, బొంబాయి తదితర రాష్ట్రా లకు నేరుగా రైలు సర్వీసులు ఏర్పాటుచేసి 3 లక్షల టన్నులు ఎగుమతులు చేశామన్నారు. వైఎస్సా ర్సీలో ప్రభుత్వంలో అరటి పంటకు టన్ను రూ. 30000 ఉండేదని ప్రస్తుతం రూ.2000 కూడా అడిగేవారు లేదన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: