భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్ రన్ విజయవంతమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా జగన్ (YS Jagan) స్పందిస్తూ, “మా పాలనా కాలంలో ఈ ప్రాజెక్టుకు వేగవంతమైన అనుమతులు సాధించాం. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ప్రాజెక్టుకు పటిష్ఠమైన పునాది వేశాం. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. ఆ రోజు మేం చేసిన కృషే ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకోవడానికి ముఖ్య కారణం” అని వివరించారు.
Read also: AP: భోగాపురం ఎయిర్‌పోర్టు ట్రయల్ రన్ సక్సెస్‌పై సీఎం హర్షం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయి
విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయి. అంటూ పేర్కొన్నారు. అలాగే ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్‌కు అభినందనలు తెలిపారు. అదేవిధంగా, విశాఖపట్నం పోర్టును భోగాపురం విమానాశ్రయంతో అనుసంధానించే బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు 2023 మార్చిలో ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన (YS Jagan) ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: