అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. బద్ధ శత్రువులైన టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar), మరియు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన కార్యక్రమాలతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసుల భద్రత మధ్య కేతిరెడ్డి తాడిపత్రికి చేరుకోనుండగా, అదే సమయంలో శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించనున్నారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు హైకోర్టు(high court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో, యల్లనూరు మండలం తిమ్మంపల్లిలోని ఆయన నివాసం నుంచి తాడిపత్రికి పోలీసులు భద్రత కల్పించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ పర్యటన సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైతే బలగాలను ఉపయోగించవచ్చని పోలీసులకు సూచించింది. గతంలో తమ ఆదేశాలను పోలీసులు పాటించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

నోటీసులను పట్టించుకోని జేసీ వర్గీయులు
అదే సమయంలో, జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలను ఆహ్వానించారు. పట్టణంలో శాంతిభద్రతల(Law and order) సమస్యలు తలెత్తవచ్చని భావించిన పోలీసులు, కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచిస్తూ జేసీకి నోటీసులు జారీ చేశారు. అయితే, తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని జేసీ వర్గీయులు తేల్చిచెప్పినట్లు సమాచారం.

ఈ రెండు వర్గాల కార్యక్రమాలతో తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి, నిఘా పెంచారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాడిపత్రిలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
జైసి ప్రభాకర్ రెడ్డి ఎవరు?
జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగు దేశం పార్టీకి చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు. ఇతను తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్నారు. అలాగే, గతంలో తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఆయన రాజకీయ జీవితం ఎలా ఉంది?
జేసీ ప్రభాకర్ రెడ్డి 1987లో తొలిసారి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2000లో తిరిగి ఆ పదవిని చేపట్టారు. 2014-2019 మధ్య కాలంలో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు
Read more: hindivaartha.com
Read also: