ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణుడు. ఆయన అనేక ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ పద్ధతులు నేర్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు తమిళనాడులో దివంగత కరాటే మాస్టర్ షిహాన్ హుస్సేన్ వద్ద శిక్షణ పొందారు.ఆ కాలంలోనే పవన్‌కు రెన్షి రాజాతో పరిచయం ఏర్పడింది. దాదాపు 34 ఏళ్ల తర్వాత ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న పవన్
1990లలో షిహాన్ హుస్సేన్ కరాటే స్కూల్‌లో రెన్షి రాజా (Renshi Raja at Karate School) తన సీనియర్ అని పవన్ గుర్తుచేశారు. తాను గ్రీన్ బెల్ట్ సాధించిన సమయంలో, రెన్షి రాజా బ్లాక్ బెల్ట్ పొందారని చెప్పారు.
గురువు ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న రెన్షి రాజా
ఇప్పుడు రెన్షి రాజా అదే స్కూల్‌కు నాయకత్వం వహించడం తనకు ఆనందంగా ఉందని పవన్ తెలిపారు. షిహాన్ హుస్సేన్ ఆశయాలను ఆయన కొనసాగించడం సంతోషకరమని అన్నారు.
కరాటే ఫొటోలను పంచుకున్న పవన్
ఈ భేటీలో పాత అనుబంధం, మార్షల్ ఆర్ట్స్‌పై ఉన్న అభిరుచి గురించి చర్చించుకున్నారని పవన్ తెలిపారు. ఆ క్షణాలు మధుర జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేశాయని చెప్పారు. తాజాగా రెన్షి రాజాతో కలిసి కరాటే ప్రాక్టీస్ చేసిన ఫొటోలను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నారు.
Read Also : Salman Khan : చిత్రీకరణలో తోటి నటుడి మెడపై నిజమైన కత్తిపెట్టిన సల్మాన్ ఖాన్