ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగ(IT Campus) అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడుతోంది. విశాఖపట్నంలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు దిశగా ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ క్రమంలో యెండాడ, పరదేశిపాలెం పరిసర ప్రాంతాల్లో కంపెనీ ప్రతినిధులు భూములను పరిశీలించినట్లు తెలిసింది.
Read also: Amazon Pay: కొత్త పెట్టుబడి సేవ.. యాప్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు

భూమి కేటాయింపులో భాగంగా, ఎకరానికి 99 పైసల లీజు రేటుతో మొత్తం 20 ఎకరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫోసిస్ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఈ అంశంపై ఈ నెలాఖరులో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని వర్గాలు చెబుతున్నాయి. ఇన్ఫోసిస్‌తో పాటు ఇప్పటికే TCS, యాక్సెంచర్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖ వైపు ఆసక్తి చూపుతుండటంతో, నగరంలో ఐటీ రంగానికి(IT Campus) మరింత ఊపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ఫలితంగా ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు విశాఖ ఐటీ హబ్‌గా ఎదిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: