విజయవాడ : కృష్ణా ఈస్టర్న్ డెల్టా చివరన ఉన్న ప్రతి ఏకరాకు సాగు నీరందేలా రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆదేశించారు ప్రకాశం బ్యారేజ్ నుండి 10,400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నా దిగువన ఉన్న రైతులకు సాగు నీరు అందడం లేదని, దీనిపై గత 20 రోజులుగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కృష్ణాజిల్లాలోని పెడన, గుడివాడ నియోజక వర్గాల్లో పర్యటించిన మంత్రి వడ్లమన్నాడు డ్రైన్, గుడ్లవల్లేరు లాకులను స్వయంగా పరిశీలించి రైతుల సాగునీటి కష్టాలు అడిగి తెలుసు కున్నారు. ఇరిగేషన్ శాఖలోని సిఈ స్థాయి నుండి కింది స్థాయి ఉద్యోగులు అందరరూ కెనాల్స్ పై తిరుగుతూ రైతులకు సాగు నీరు అందేలా పర్యవేక్షించాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఒక ఏడాది వరదలు వస్తే, రెండు మూడు సంవత్సరాలకు సరిపడేలా వాటర్ మేనేజ్ మెంట్ ద్వారా నీటి నిల్వలు చేయాలని చంద్రబాబు (Chandrababu) ఆదేశించారని తెలిపారు. నాడు రూ.1350 కోట్లతో చంద్రబాబు పట్టిసీమ నిర్మిస్తే, పట్టిసీమ కాదు అది ఒట్టిసీమ అని జగన్ అసెంబ్లీలో ఎద్దేవా చేశాడని, అదే పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు గోదావరి జలాలు తీసుకొచ్చి 50వేల కోట్ల ఆదాయం సృష్టించామని స్పష్టం చేశారు.

గత 5ఏళ్ళ వైసిపి పాలనలో నిర్వీర్యమైన సాగు నీటి సంఘాలకు చంద్రబాబు పునరుజ్జీవం పోయడంతో ఇరిగేషన్ వ్యవస్థ బాగుపడింది అని తెలిపారు. వైసిపి పాలనలో కాలువల్లో పూడిక తీత, డీసిల్టింగ్ పనులు చేయలేదని, ఈపనులకు 5 ఏళ్ళలో 100 కోట్లు కూడా కేటాయించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యవసర పనుల కింద రూ.700 కోట్లు కేటాయించి కాలువల్లో పూడిక తీత వంటి పనులను సాగు నీటి సంఘాల సహాకారంతో పూర్తి చేయగలిగామని అన్నారు. గత ప్రభుత్వం శ్రీశైలం ప్లంజ్ పూల్ ప్రమాదం లో ఉంటే గత 5ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, శ్రీశైలం ప్లంజ్ పూల్, ధవళేశ్వరం గేట్ల మారమ్మతులకు రూ.350 కోట్లు కేటా యించామని తెలిపారు మంత్రి నిమ్మల. జగన్ వ్యవహార శైలి చూస్తుంటే రానున్న రోజుల్లో ఇప్పుడొచ్చిన సీట్లు కూడా రావని, అందుకే విద్రోహ చర్యలకు పాల్పడుతూ తన కార్య కర్తలను రెచ్చగొడుతున్నాడని పేర్కొన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :