हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రణాళికలు ఎపిఐటిసిఓ బృందం పరిశీలన

Saritha
Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రణాళికలు ఎపిఐటిసిఓ బృందం పరిశీలన

Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రిపై మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఎపిఐటిసిఓ ఎండి రాజీవ్ మెహ్రా బృందం ఆలయ ఇఓ శీనానాయక్, చైర్మన్ బి. రాధాకృష్ణలతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత నూతన క్యూ లైన్ కాంప్లెక్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ భవనానికి సంబంధించి డిపిఆర్ తయారీపై, అన్నదానం కాంప్లెక్స్, సెల్లార్ స్పేస్ వినియోగంపై బృందం కీలక సూచనలు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారి సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఎపిఐటిసిఓ సేవలను ఆలయ అభివృద్ధికి వినియోగించుకునేలా చేయడంలో ఎంపి కేశినేని చిన్ని కీలక పాత్ర పోషించారని బృందం పేర్కొన్నారు. ఆలయ ఆధ్యాత్మికత దెబ్బతినకుండా, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక హంగులతో మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమాదేవి, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

Read Also: Andhra pradesh: ఐపిఎస్ అధికారి సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు

Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రణాళికలు ఎపిఐటిసిఓ బృందం పరిశీలన
Indrakeeladri Temple: APITCO team examines plans for the development of Indrakeeladri

మహా కుంభాభిషేక పనులను సత్వరమే పూర్తి చేయాలి

మహా కుంభాభిషేక మహోత్సవానికి సంబంధించి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి మరియు జీర్ణోద్ధరణ పనులను నిర్ణీత గడువులోగా, అత్యంత నాణ్యతతో పూర్తి చేయాలని ఆలయ ఆలయ ఇఓ శీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణలు అధికారులను ఆదేశించారు. సోమవారం ఇఇ శ్రీరామ, డిఇఇ అశోక్ కుమార్తో కలిసి ప్రధాన ఆలయ పైభాగంలోని విమాన గోపురం వద్ద జరుగుతున్న పనులను, ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్, ఇఓ మాట్లాడుతూ భక్తుల సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకుని, మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ముఖ్యంగా విమాన గోపురం వద్ద జరుగుతున్న పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని, తుది మెరుగులు దిద్దే పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ప్రధాన ఆలయ శోభ ఉట్టిపడేలా, భక్తులకు కంటికి విందుగా ఉండేలా ఏర్పాట్లు ఉండాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

గ్రహణం కారణంగా మంగళవారం గిరి ప్రదక్షణ రద్దు

ఫాల్గుణ పౌర్ణమి అయిన 3వ తేదీ మంగళవారం మధ్యాహ్నం చంద్ర గ్రహణము సందర్భముగా దేవస్థాన వైదిక కమిటీ వారి సూచనల మేరకు ఆగమ శాస్త్ర ప్రకారము ఉదయం 10గం.ని.లకు శ్రీ అమ్మవారి ప్రధానాలయం, ఇతర ఉపాలయముల కవాట బంధనము చేసి, 4వ తేదీ బుధవారము ఉదయం 3 గంటలకు శ్రీ అమ్మవారి ప్రధానాలయము, ఉప ఆలయముల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నవనాభిషేకములు నిర్వహించిన అనంతరం అర్చన, మహానివేదన, హారతి నిర్వర్తింప చేసిన తదుపరి ఉదయం 8గంటలకు భక్తులకు దర్శనము కల్పించబడునని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు.

గ్రహణ స్పర్శ కాలము మధ్యాహ్నం 3 గంటల 20ని.లు నుండి గ్రహణ మోక్ష కాలము సాయంత్రం 6.48 వరకు మొత్తం గ్రహణ కాలము 3.28 గం.ని.లు వుంటుందని ఆలయ వైదిక కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ, శాంతి కల్యాణం, చండి హామం, పంచ హారతులు, పల్లకీ సేవలు రద్దు చేశామన్నారు. 4న ఆర్జిత సేవలు రద్దు బుధవారం తెల్లవారుజామున 3 గం.లకు స్నపనాభిషేకములు, అర్చనాది కార్యక్రమములు నిర్వహించు సందర్భముగా తెల్లవారు జామున నిర్వహించు ఆర్జిత సేవలు అయిన ‘సుప్రభాతం, వస్త్రం సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, గణపతి హోమము’లను రద్దు చేశామని, ఉదయం 7.30గం. ని.లకు ప్రారంభము అగు ఆర్జిత సేవలను ఉదయం 8.30గం.ని.ల నుండి ప్రారంభించి నిర్వహిస్తారన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

మంగళగిరి శ్రీవారి కల్యాణంలో మంత్రి నారా లోకేశ్‌ దంపతులు

మంగళగిరి శ్రీవారి కల్యాణంలో మంత్రి నారా లోకేశ్‌ దంపతులు

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

మహిళలపై నేరాలు 4.4శాతం తగ్గాయి

మహిళలపై నేరాలు 4.4శాతం తగ్గాయి

ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రణాళికలు ఎపిఐటిసిఓ బృందం పరిశీలన

ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రణాళికలు ఎపిఐటిసిఓ బృందం పరిశీలన

భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

బాల్క సుమన్ కు షరతులతో బెయిల్

బాల్క సుమన్ కు షరతులతో బెయిల్

సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్ల పంపిణీ

సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్ల పంపిణీ

చంద్రబాబుతో పవన్ కీలక భేటీ

చంద్రబాబుతో పవన్ కీలక భేటీ

కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత

దుబాయ్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు!

దుబాయ్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు!

ఇంతకీ నెతన్యాహు ఎక్కడ? కొనసాగుతున్న సస్పెన్స్

ఇంతకీ నెతన్యాహు ఎక్కడ? కొనసాగుతున్న సస్పెన్స్

📢 For Advertisement Booking: 98481 12870