విజయవాడ : రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేలా ఉన్నత ప్రమాణాలతో కొత్త క్రీడా ప్రాంగణం ఏర్పాటుతోపాటు పాత వాటిని ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడ నడిబొడ్డుననున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని(Indira Gandhi Stadium) అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది. 2028 చివరి నాటికి దీన్ని ఆధునీకరించి, 2029 లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్), విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్(విఎంసి) సంయుక్తంగా ఈ స్టేడియం అభివృద్ధి, నిర్వహణ చేపటనున్నాయి.
Read Also: Ibomma Ravi: అన్నింటికీ నేను బాధ్యుడిని కాదు

ప్రైవేటు క్రీడేతర కార్యక్రమాలు ఉండవని
పనులకు రూ.53 కోట్లు అంచనా వేయగా, రూ.30 కోట్లతో మొదటి విడత పనులు ప్రారంభిచనున్నారు. ఈ నెలాఖరు కల్లా అధికారులు డీపీఆర్ను ప్రభుత్వానికి అందించ నున్నారు. స్టేడియంలో ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు క్రీడేతర కార్యక్రమాలు ఉండవని అధికార వర్గాలు వెల్లడించాయి. స్టేడియంలో ఇప్పుడున్న కొన్ని నిర్మాణాలను ఆధునీకరించి, మరికొన్ని భవనాలు
నిర్మించి అదనపు కోర్టులు, వసతులు అందుబాటు లోకి తేవాలని ప్రతిపాదనలున్నాయి. ఇప్పుడున్న శాప్ ప్రధాన కార్యాలయాన్ని తొలగిస్తారు.
ఆ స్థలంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఇంటర్నేషనల్(International) వెయిట్ లిఫ్టింగ్ హాల్, బాక్సింగ్ ప్రాక్టీస్ ఎరీనా, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కమర్షియల్ హాల్ను నిర్మిస్తారు. స్టేడియంలో సాధనకు 3 సింథటిక్ ఔట్డోర్ టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. అదనంగా రెండేసి చొప్పున టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ ఔట్డోర్ కోర్టుల నిర్మాణం, ప్రాక్టీస్ కోసం క్రికెట్ నెట్ ఏర్పాటు, స్థలా భావం దృష్ట్యా అవసరం లేనప్పుడు పక్కన పెట్టే గ్యాలరీలు, ప్రధాన స్టేడియం మధ్యలో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ మధ్య ఫుట్బాల్ ఫీల్డ్, గ్యాలరీలకు అనుసంధానంగా ఓ వైపు భవ నం నిర్మాణం, మొదటి అంతస్థులో మరో సింథ టిక్ వార్మప్ ట్రాక్. గ్యాలరీ లకు నేరుగా ప్రధాన స్టేడియం చేరుకునేలా మార్గం ఏర్పాటు చేస్తారు. క్రీడా క్యాంపులకు వీలుగా గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్, డార్మెంటరీ, వసతి సదుపాయాలు అందుబాటు లోకి వస్తాయి. ప్రధాన స్టేడియం గ్యాలరీల కింద ఉన్న గదుల ఆధునీకరిస్తారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: