రైల్వే శాఖ(Indian Railways) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లను దశలవారీగా ప్రవేశపెట్టే క్రమంలో, మొదటి విడత కేటాయింపుల్లోనే తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య/వారణాసి మార్గానికి స్లీపర్ రైలుకు ప్రాథమిక ఆమోదం లభించింది.
Read Also: HYD: హైదరాబాద్‌లో కొత్త AI సెంటర్‌తో 3,000 ఉద్యోగాలు..

విశాఖ–సికింద్రాబాద్, కాచిగూడ–యశ్వంత్‌పూర్, విజయవాడ–చెన్నై, సికింద్రాబాద్–తిరుపతి మార్గాల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లు(Indian Railways) మంచి ఆక్యుపెన్సీ సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, దూర ప్రయాణాలు సులభం చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పలు స్లీపర్ రైళ్లకు ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి.
ప్రతిపాదనలలో ముఖ్యమైనవి:
- విశాఖ → తిరుపతి
- విశాఖ → బెంగళూరు
- విజయవాడ → బెంగళూరు (ఆమోదం ఉన్నా సాంకేతిక కారణాలతో ఆలస్యం)
విజయవాడ–చెన్నై వందే భారత్‌ను నర్సాపురం వరకు పొడిగించడం కూడా ఈ అవసరాన్ని మరింత పెంచింది. వరుసగా వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో, AP నుంచి అయోధ్య/వారణాసి మార్గంకు వందే భారత్ స్లీపర్ ప్రవేశపెట్టడానికి రైల్వే శాఖ అంగీకరించింది. ఈ మార్గానికి సంబంధించి షెడ్యూల్, రూట్ ప్లానింగ్ తుది దశలో ఉంది. సంక్రాంతి నాటికి ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఎక్కువగా ఉంది.
రాత్రి సర్వీస్‌గా రూపకల్పన
విజయవాడ → వరంగల్ → అయోధ్య మార్గంలో రాత్రివేళ నడిచే స్లీపర్ రైలు రూపకల్పన జరుగుతోంది. ఈ సర్వీస్ ప్రవేశపెడితే అయోధ్య,(Ayodhya) వారణాసి దర్శనానికి వెళ్లే తెలుగు ప్రజలకు ఇది పెద్ద వరం కానుంది. ఈ రైలును రెండో దశలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ముఖ్య నాయకులు సంకేతాలు ఇస్తున్నారు. ఈ రెండు రూట్లు ప్రారంభమైతే తెలుగు రాష్ట్రాలకు స్లీపర్ వందే భారత్ సర్వీసులో మరింత సౌకర్యం కలగనుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: