6వ స్నాతకోత్సవంలో 255 మందికి డాక్టరేట్ పట్టాలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తికి సమీపంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన భారతీయ విజ్ఞాన శిక్షణ మరియు పరిశోధన సంస్థ భవిషత్తులో శాస్త్ర విజ్ఞాన లక్ష్యాలకు మణిదీపం కాగలదని మంగళవారం జరిగిన పదవ వార్షికోత్సవం, 6వ స్నాతకోత్సవ సభలో ప్రసంసించారు. 255 మంది విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలను అతిధులు అందించారు. ఐసర్ 2015లో మంజూరు చేసి అదే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించగా సొంత భవనాల్లో మొదటిసారి 6వ స్నాతకోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్బంగా సంస్థ డైరెక్టర్ శాంతను భట్టాచార్య (Director Shantanu Bhattacharya) పదేళ్ళలో సాధించిన ప్రగతిని విశ్లేషించారు. పరిశోధన వైజ్ఞానిక అవిష్కరణలకు పునాది వేసే విధంగా తిరుపతి ఐసర్ను నిర్మించామన్నారు. సుమారు 256 ఎకరాల్లో నిర్మించిన విద్యాసంస్థ ప్రత్యేక శిల్పకళతో తీర్చిదిద్దామన్నారు. ఈ కార్యంపస్కు గ్రీహా కౌన్సిల్ మరియు తేరి 4 స్టార్ ఎల్డీ రేటింగ్ ఇచ్చాయని వివరించారు. ఇక్కడ నిర్మించిన ఒక్కొక్క భవనానికి ఎంతో ప్రత్యేకతను ఇచ్చామన్నారు. ముఖ్యంగా గ్రంధాలయం, ఆడిటోరియం వంతి భవనాల్లో భారతీయ, విదేశీ ప్రముఖ శాస్త్రవేత్తలు పేర్లను పొందు పరచామన్నారు. దానిని నిర్మాలోనే మిళీతం చేసామని భట్టా చార్య వివరించారు. భారతీయ శాస్త్రీయరంగంలో ప్రతిభకు తిరుపతి ఐసర్ పట్టం కట్టిందన్నారు. పదేళ్ళ ప్రస్తానంలో ఎన్నో విజయాలు సాధించినట్లు భట్టాచార్య వివరించారు. ఈ విద్యా సంవత్సరం 210 పరిశోధనా పత్రాలు ప్రచురించబడ్డాయని ఇందుకు రూ.29.43 కోట్లు బహిరంగ పరిశోధనా నిధులు అందుకున్నామని వివరించారు. నెచర్ ఇండెక్స్ 2025 ప్రకారం తిరుపతి ఐసర్ 33వ స్థానంలో నిలిచినట్లు డైరెక్టర్ భట్టాచార్య వివరించారు. స్టాన్ ఫోర్ట్ యూనివర్శిటి ప్రకటించిన ప్రపంచ ఉత్తమ 2శాతం శాస్త్రవేత్తల జాబితాలో ఎనిమిది మంది ఫ్యాకల్టీ సభ్యులు ఉండటం గర్వకారణమన్నారు.

ఈ విద్యాసంవత్సరం నుంచి తిరుపతి ఐసర్ కొత్తగా రెండు సంవత్సరాల మాస్టర్ బైరీసెర్చ్ (MS-R) కోర్సును ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ విద్యాసంవత్సరం కొత్తగా 400 మంది విద్యార్థులు చేరుతున్నట్లు వివరించారు. స్పోర్ట్స్ కాంప్లెక్సు, ఫైవ్ స్టార్ల్యాబ్స్, పే అండ్ ఈట్ మెస్, ఆధునిక నివాసాల మధ్య విద్యార్థుల సంపూర్ణ అబివృద్ధికి ఏర్పాట్లు చేస్తున్నట్లు భట్టాచార్య వివరించారు. నేల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చగల శక్తికి శాస్త్రవేత్తలకు ఉంది. సోమయ్య ముఖ్యఅతిధిగా వచ్చిన గోదావరి బయోరిఫైనరీస్ లిమిటెడ్ చైర్మన్ సోమయ్య విద్యాసంస్థల ఛాన్సలర్ సమీర్ సోమయ్య విద్యార్థులను ఆకర్షిస్తూ ప్రసంగాన్ని ఆంగ్లంలోనూ, హిందీలో సాగించారు. తన ప్రసంగాన్ని హిందీలోను, ఆంగ్లంలోను కొనసాగించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :