Hyderabad: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భక్తులు తమ భక్తిని రకరకాలుగా చాటుకుంటారు. ఇటీవల కాలంలో టీటీడీ (TTD) ట్రస్టులకు భక్తుల నుంచి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. కొందరు వాహనాలు, విలువైన వస్తువుల్ని బంగారం, వెండి కానుకలు సమర్పిస్తే, మరికొందరు టీటీడీ నిర్వహించే వివిధ సేవా సంస్థలకు భారీగా విరాళాలు అందజేస్తుంటారు. తాజాగా టీటీడీకి మరో భారీ విరాళం అందింది. తాజాగా, హైదరాబాద్కు చెందిన శివకోటి సిద్ధార్థ అనే భక్తుడు స్వామివారిపై ఉన్న భక్తితో రూ. 50 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు.
Read Also: TTD International Women’s Day: టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

దాతను అభినందించిన ఈవో
శివకోటి సిద్ధార్థ తాను అందజేసిన రూ. 50 లక్షల విరాళాన్ని శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు కేటాయించారు. శుక్రవారం తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిని కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ట్రస్టుకు ఇంత భారీ విరాళం అందించిన దాతను ఈవో అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: