ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కి బిగ్ రిలీఫ్ దక్కింది. గత ప్రభుత్వం సమయంలో ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందంటూ ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అంతే కాకుండా ఈ కేసులో చంద్రబాబుతో పాటు మిగిలిన వారికి క్లీన్‌చిట్ ఇచ్చింది.
Read Also: Kollikapudi Srinivas: మరోసారి వార్తల్లో తిరువూరు ఎమ్మెల్యే

కోర్టు తీర్పు
2014-19 మధ్య ఫైబర్‌నెట్‌లో ₹114Cr స్కామ్ జరిగిందని కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా CID అధికారులు ఆ కేసు దర్యాప్తును ముగించినట్లు కోర్టుకు తెలిపారు. కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని నాటి, నేటి ఫైబర్‌నెట్ MDలు చెప్పారు. దీంతో కోర్టు తీర్పు వెలువరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: