हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Operation Eagle : రైళ్ల ఆపరేషన్ ఈగిల్ ద్వారా భారీగా గంజాయి, చాక్లెట్లు స్వాధీనం – డిజిపి హరీష్

Shravan
Operation Eagle : రైళ్ల ఆపరేషన్ ఈగిల్ ద్వారా భారీగా గంజాయి, చాక్లెట్లు స్వాధీనం – డిజిపి హరీష్

విజయవాడ Operation Eagle : రాష్ట్రవ్యాప్తంగా రైళ్ల ద్వారా గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చేపట్టిన “ఆపరేషన్ ఈగల్” (Operation Eagle) వరుస విజయాలు సాధిస్తుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయిపై ఉక్కుపాదం మోపి, గంజాయి ఉనికే రాష్ట్రంలో లేకుండా చేసామన్నారు. గంజాయి స్మగ్లర్లు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించామన్నారు., సరిహద్దు రాష్ట్రమైన ఒరిస్సా నుండి రైళ్ల ద్వారా రాష్ట్రం మీదుగా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నేపథ్యంలో, వారిని లక్ష్యంగా చేసుకుని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో, జీఆర్పీ, ఆర్పీఎఫ్, సీఆర్పీఎఫ్ స్థానిక పోలీసుల సమన్వయంతో చేపట్టిన “ఆపరేషన్ ఈగల్” ద్వారా రాష్ట్రంలోని వివిధ రైల్వే స్టేషన్లలో గంజాయి. గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. 53 రైళ్లలో ఈగల్ జరిపిన ఈ ఆపరేషన్ లో 43 కేజీల గంజాయి, 436 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకోని 10 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి 10 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ (12841) విజయవాడలో 445 గ్రాముల (79 గంజాయి చాక్లెట్లు) స్వాధీనం, బీహార్ కు చెందిన ఒకరిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. రాయఘడ గుంటూరు ఎక్స్ ప్రెస్ (17244) విజయనగరం.4.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కర్నూలుకు చెందిన ముగ్గురి అరెస్ట్ చేసామన్నారు. కోర్బా విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ (18517) విజయనగరం. 15.8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని రాజస్థాన్, ఢిల్లీకి చెందిన ఇద్దరి అరెస్ట్ చేసామన్నారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్ (20853) తెనాలిలో 107 గంజాయి చాక్లెట్లు స్వాధీనం. కోరమండల్
స్వాధీనం నిందితుడు ఎక్స్ ప్రెస్ (12841) విజయవాడలో 220 గ్రాములు (40 గంజాయి చాక్లెట్లు) స్వాధీనం చేసుకుని ఝార్ఖండ్ కు చెందిన వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వివేక్ ఎక్స్ ప్రెస్ (22851) ఒంగోలులో 3.72 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. టాటానగర్ ఎర్ణాకులం ఎక్స్ ప్రెస్ (18189) గూడూరులో 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన ఒకరి అరెస్ట్ చేసామన్నారు. కొత్తవలస రైల్వే స్టేషన్, ప్లాట్ ఫామ్ (Railway station, platform) రెండులో 1.133 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేసారు.

Operation eagle

కొత్తవలస రైల్వే స్టేషన్, ప్లాట్ ఫామ్లో 26.289 కేజీల గంజాయి చేసుకున్నామన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్నాడన్నారు. ప్రశాంతి ఎక్స్ ప్రెస్ (18463) అనంతపురంలో 1050 గ్రాముల (210 గంజాయి చాక్లెట్లు) స్వాధీనం చేసుకుని ఒడిశాకు చెందిన వ్యక్తి అరెస్ట్ చేసామన్నారు. ఆపరేషన్ ఈగల్ అమలు ద్వారా రైల్వే మార్గంలో మత్తు పదార్థాల రవాణా నెట్వర్క్ లపై పటిష్ట పర్యవేక్షణ, నిఘా ద్వారా గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడం జరిగిందన్నారు. రైళ్ల ద్వారా ఒడిశా నుండి ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతున్న గంజాయిని అడ్డుకోవడంలో ఈ ఆపరేషన్ కీలకపాత్ర పోషించిందని డీజీపీ అన్నారు. ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా బీహార్, ఢిల్లీ, తమిళనాడు, ఝార్ఖండ్ కు అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న గంజాయి నెట్ వర్క్ మీద పెద్ద ఎత్తున విజయం సాధించడం జరిగిందని డీజీపీ తెలిపారు. ఈ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతుందని అన్నారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసు సిబ్బంది. అధికారులను డీజీపీ ఈ సందర్భంగా అభినందించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/dont-believe-rumors-on-social-media-minister-anitha/business/530075/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870